Tuesday, September 17, 2024
Homeహెల్త్After meals: తిన్నారా? అయితే ఈ పనులు చేయద్దు

After meals: తిన్నారా? అయితే ఈ పనులు చేయద్దు

భోజనం చేశాక ఈ పనులు చేయొద్దు…
 అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. అలా చేస్తే తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసంక్రుత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.
 తినగానే నిద్ర పోకూడదు. అలా నిద్రపోతే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.
 అన్నం తిన్న తర్వాత పది నిమిషాలు నడిస్తే మంచిదంటారు. కానీ తిన్న వెంటన నడిస్తే జీర్ణవ్యవస్థ పోషకాలను సరిగా గ్రహించలేదు. అందుకే ఆహారం తిన్న వెంటనే కాకుండా ఓ పదినిమిషాల తర్వాత నడిస్తే మంచిది.
 భోజనం చేయడానికి ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు. అలా చేస్తే పొట్ట పెరిగే అవకాశం ఉంది.
 తినగానే స్నానం చేయకూడదు. అలా చేస్తే కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. ఫలితంగా పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనితో జీర్ణ వ్యవస్థ పనితీరు తగ్గుతుంది.
 భోజనం చేసిన వెంటనే చిరుతిళ్లు తినకూడదు. అలా చేస్తే పొట్ట పెరగడంతోపాటు శరీర బరవు కూడా పెరుగుతారు. అంతేకాదు ఇలా తినడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడి దాని పనితీరు దెబ్బతింటుంది కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News