Saturday, November 23, 2024
Homeహెల్త్After workouts: వర్కవుట్ల తర్వాత చర్మానికి ఈ జాగ్రత్తలు అవసరం

After workouts: వర్కవుట్ల తర్వాత చర్మానికి ఈ జాగ్రత్తలు అవసరం

వర్కవుట్లు చేసిన తర్వాత చెమట బాగా కారుతుంది. ఆ చెమట చర్మానికి అంటుకుని ఉంటుంది. దీంతో చర్మంపై ఇరిటేషన్, దురదలాంటివి వస్తాయి. వర్కవుట్ల తర్వాత వంటిలో ఉత్పత్తి అయ్యే వేడివల్ల, చెమట వల్ల చర్మం దెబ్బతింటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా వర్కవుట్ చేసేటప్పుడు ఎక్విప్ మెంటును కూడా పట్టుకుని చేస్తుంటాం కాబట్టి వాటి మీద ఉండే బాక్టీరియా కూడా మన చర్మంపై చేరే అవకాశం ఉంటుంది.
పోస్టు వర్కవుట్ తర్వాత చర్మం చాలా సున్నితంగా అవుతుంది. కాబట్టి దానిపై హార్ష్ స్ర్కబ్స్ లేదా ట్రీట్మెంట్లు అప్లై చేయకూడదు. అలా కనుక చేస్తే చర్మం దెబ్బతిని బాగా మండుతుంది. అందుకే వర్కవుట్ అయిన వెంటనే ముందర చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఉష్ణోగ్రత సాధారణస్థాయికి వస్తుంది. వర్కవుట్ చేసిన తర్వాత చర్మంపై ఏర్పడే ఎర్రదనం నుంచి సాంత్వన పొందాలంటే తగినంత హైడ్రేటింగ్ ని అందించే, సాంత్వననిచ్చే నౌరిషింగ్ సిరమ్ ను వాడాలి. ఫలితంగా చర్మం పై మంట ఉండదు. దురదగా అనిపించదు. ఈ సమయంలో కెమికల్ ఎక్స్ ఫోయిలేట్ ను అస్సలు చేయకూడదు.

- Advertisement -

అలా కనుక చేస్తే చర్మంపై దాని దుష్ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. చర్మం మరింత ఎక్కువగా దెబ్బతింటుంది. వర్కవుట్ చేసిన తర్వాత శరీరంలో తేమ తగ్గుతుంది. దాంతో చర్మం పొడిబారినట్టు
అవుతుంది. అంతేకాదు స్కిన్ అట్టగట్టినట్టు తయారవుతుంది. వర్కవుట్ల వల్ల శరీరం కోల్పోయిన నీటిని, తేమను చర్మానికి తిరిగి అందించాల్సి ఉంటుంది. అందుకే మీ చర్మం టైపుకు అనుగుణంగా లైట్ వెయిట్ జెల్ మాయిశ్చరైజర్ ను ఇందుకు వాడాలి. అలాగే చర్మానికి కావలసినంత నీరు అందేలా జాగ్రత్తపడాలి. మేకప్ తో వర్కవుట్ చేస్తే మరింత సమస్యలు చర్మంపై తలెత్తుతాయి. మేకప్, చెమట కలిపి యాక్నేకి కారణమైన బాక్టీరియా చర్మంపై ఏర్పడే అవకాశం ఉంది.
అందుకే వర్కవుట్ చేసే ముందు మేకప్ ను పూర్తిగా తొలగించాలి. ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాలలో తగినంత గాలి వెడుతుంది. మేకప్ తప్పనిసరి అయినపుడు మినరల్ బేస్డ్ ఉత్పత్తులను వాడడం మంచిది. నిత్యం వాడే మేకప్ లో ఉండే ఇరిటేట్ చేసే రసాయనాలు మినరల్ బేస్డ్ ఉత్పత్తుల్లో ఉండవు. ఇవి గుర్తుపెట్టుకుంటారు కదూ..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News