పెదాలపై ముడతలు కనిపించకుండా…
మీరు యాభై ఒడిలో పడ్డారా? అయితే పెద్దతనపు వయసు తాలూకా మార్పులు మీ శరీరంపై కనపడతాయి. అలాంటి వాటిల్లో పెదాలపై ముడతలు ఏర్పడడం కూడా ఒకటి. వయసు మీద పడడం వల్ల తలెత్తే ఈ సమస్య ఎంతో సహజమైంది. అదే సమయంలో వాతావరణంలో వస్తున్న మార్పులు సైతం మన శరీరంపై ప్రభావం చూబిస్తుంటాయి. అలాగే అనారోగ్యపు ఆహారపు అలవాట్లు కూడా ఇందుకు కారణమే. అదేవిధంగా సరైన స్కిన్ కేర్ తీసుకోకపోయినా, డీహైడ్రేషన్ వల్ల కూడా చర్మం ముడతలు పడి ఎక్కువ వయసు ఉన్నట్టు కనిపిస్తాం.
దీన్ని నివారించేందుకు బొటాక్స్, మైక్రోడెర్మోమాబ్రాషన్ వంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఈ లక్షణాలను కనిపించకుండా ఇవి ఎంతో తోడ్పడతాయి. అయితే మీరు వేసుకునే మెకప్ ద్వారా కూడా చర్మంలోని లోపాలు కనపడకుండా యవ్వనంగా కనిపించవచ్చు. పెదాలపై ఉండే ముడతలకు సంబంధించి తీసుకుంటే ఏభై సంవత్సరాలు నిండిన స్త్రీలు పెదాలకు సరైన షేడ్ ఉన్న లిప్ స్టిక్ ను వాడడం చాలా అవసరం అంటున్నారు బ్యూటీ నిపుణులు. ఎందుకంటే వీరు వేసుకునే లిప్ స్టిక్ నలుగురిలో వారిని ప్రత్యేకంగా నిలబెడతుంది. అంతేకాదు మీ లుక్స్ ను కొన్నిసార్లు పాడుచేస్తుంది కూడా. అందుకే రాంగ్ షేడ్ లిప్ స్టిక్ పెదాలపై వేసుకోకూడదు. ఇలా చేస్తే పెదాలపై కనపించకుండా దాచాలనుకుంటున్న ముడతలు, ఇతరత్రా సమస్యలు బయట పడతాయి.
మనం చేసే మరో తప్పు ఏమిటంటే వేసుకునే లిప్ స్టిక్ సరైన షేడా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి దాన్ని కొనేముందర స్టోర్ లో అరచేతి పైభాగంలో రాసుకుని పరీక్షిస్తుంటాం. దీనివల్ల చర్మంపై లిప్ స్టిక్ రంగు లుక్ ఎలా ఉంటుందో స్పష్టంగా తెలిసే అవకాశం ఉండదు. మీ వేలి కొసన లిప్ స్టిక్ ను అప్లై చేసి చూడాలి. అలాగే ఆ వేలిని పెదాల దగ్గరగా పెట్టుకొని ఆ రంగు మీ పెదవుల రంగుకు మ్యాచ్ అయిందా లేదా గమనించుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే 50 ఏళ్లు దాటిన స్త్రీలు తమ పెదవులకు న్యూడ్ లిప్ స్టిక్ సరిపోదని భావిస్తారు. న్యూడ్ కలర్ షేడ్స్ పెదాలపై వేసుకుంటే అవి పాలిపోయినట్టు కూడా ఉంటాయి. న్యూడ్ షేడ్ బేస్ స్కిన్ టోన్ కు రెండు షేడ్లు ఎక్కువ డార్క్ గా ఉండేలా చూసుకుంటే పెదాలపై ఉండే ఫైన్ లైన్స్ ,ముడతలు కనిపించవు. దీంతో వాళ్లు యంగ్ గా కూడా కనిపిస్తారు.
సహజసిద్ధంగా కనిపించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. పెదాలపై ఉన్న ముడతలు కనిపంచకుండా ఉండాలంటే మీ పెదవుల సహజసిద్ధమైన రంగుకు సరిడే లిప్ లైనర్స్ ను వాడాలి. లిప్ లైనర్ వాడడం వల్ల పెదాలపై లిప్ స్టిక్ అలాగే ఉంటుంది. లిప్ లైనర్స్ వాడకపోతే లిప్ స్టిక్ కారిపోయే అవకాశం ఉంది.