Friday, November 22, 2024
Homeహెల్త్All day Fresh fragrance from you: రోజంతా మీరు సువాసనలు చిందించాలంటే..

All day Fresh fragrance from you: రోజంతా మీరు సువాసనలు చిందించాలంటే..

బిర్యానీ తిన్నాక మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది దాన్ని పోగొట్టాలంటే..

చూడడానికి అందంగా ఉండడమే కాదు మీ చుట్టూ ఉన్న వారికి మీ ఉనికి ఉల్లాసాన్ని కూడా కలిగించాలి. అంటే రోజంతా మీ శరీరం సువాసనలు చిందించాలి. అందుకు కొన్ని సీక్రెట్లు ఉన్నాయి. అవి పాటిస్తే మీ శరీరం శుభ్రంగా ఉండడమే కాదు సువాసనలు సైతం వెదజల్లుతుంది. ముఖ్యంగా నీళ్ల బాగా తాగడం శరీరానికి చాలా మంచిది. నీళ్లు శరీరానికి కావలసిన హైడ్రేషన్ అందివ్వడమే కాదు రోజంతా మీరు తాజాదనాన్ని కూడా ఫీలవుతారు. మీ శరీరం నుంచి చెమట వాసన రాదు.

- Advertisement -

నీళ్లు బాగా తాగడం వల్ల మీరు తిన్న ఫుడ్ ఐటమ్స్ లోని ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర వంటి వాసనల గాఢత తగ్గుతుంది. మీ ఊపిరి సైతం తాజాదనంతో ఉంటుంది. నీళ్లు బాగా తాగడం వల్ల చంకల్లో చెమట ఎక్కువ పట్టదు. దీంతో రోజంతా ఫ్రెష్ గా ఉంటారు. నార్మల్ వాటర్ బదులు డిటాక్స్ వాటర్ తాగితే శరీరంపై మరింత మంచి ప్రభావం ఉంటుంది. శరీరంపై చల్లుకున్న పెర్ఫూమ్ ఎక్కువసేపు ఉండేలా చూసుకోవాలి. పెర్ఫ్యూమ్ చల్లుకునే ముందు పల్స్ పాయింట్ల దగ్గర వాజిలైన్ లేదా పెర్ఫ్యూమ్ బేస్ అప్లై
చేసుకోవాలి. ఫ్రాగ్రెన్స్ అప్లై చేసుకున్న తర్వాత దాని మీద చేతులతో రుద్దకూడదు. ఇలా చేస్తే పర్ఫ్యూమ్ లోని టాప్ నోట్స్ దెబ్బతింటుంది. పల్స్ పాయింట్స్ లో ఫ్రాగ్రెన్స్ చల్లుకోవాలి. ఈ ప్రదేశుల వెచ్చగా
ఉంటాయి కాబట్టి అందులోని రసాయనాలు యాక్టివేట్ అయి పర్ఫ్యూమ్ వెంటనే సువాసనలు చిందిస్తుంది. చెవుల వెనుక భాగంలో, మణికట్టుపై, మోచేయి లోపల భాగంలో, మోకాళ్ల వెనుక
భాగంలో ఫ్రాగ్రెన్స్ స్ప్రే చేసుకోవాలి. షవర్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచిది.

మీరు ఎక్కడికి వెళ్లినా మీ వెంట పెర్ఫ్యూమ్ బాటిల్ ను బ్యాగులో పెట్టుకుంటే అవసరమైనపుడలా
దాన్ని శరీరంపై స్ప్రే చేసుకోవచ్చు. పాలిస్టర్ బట్టలు వేసుకోవద్దు. ఇవి చెమటను పీల్చలేవు. దీంతో శరీరంలో చెమటవాసన పెరిగి దుర్వాసన వస్తుంది. చెమటను పీల్చే కాటన్ బట్టలు వేసుకోవడం మంచిది.
బెడ్ షీట్లపై, దిండుకవర్లపై నిత్యం కొద్దిగా స్ప్రే చల్లాలి. ముఖ్యంగా రోజ్ వాటర్ వంటి నేచురల్ సెంట్స్ వాటిపై చల్లితే బాగుటుంది. ఇలా చేయడం వల్ల నిద్ర వెంటనే పడుతుంది. మంచి సువాసనలు మిమ్మల్ని చుట్టుముట్టి ప్రశాంతంగా నిద్ర పోతారు. అంతేకాదు వాటి సువాసనలు మీ శరీరంలోకి ఇంకి మీరు నిద్ర లేచినపుడు ఎంతో తాజాదనంతో ఉండడమే కాదు మీ శరీరం మంచి సువాసనలు కూడా వస్తాయి.

బిర్యానీ వంటి ఫుడ్స్ తిన్నప్పుడు వాటి వాసన నోటి నుంచి రాకుండా నీళ్లు బాగా తాగాలి. తాజా పుదీనా రసం, లెమనాయిడ్ వంటివి తాగినా నోరు తిన్న ఆహారపదార్థాల వాసన రాదు. మౌత్ ఫ్రెషనర్స్ వంటివి అందుబాటులో ఉంచుకుంటే అవసరమైనపుడు వాటిని వాడొచ్చు. అలాగే సెంట్లు వాడేటప్పుడు దాన్ని లేయర్స్ గా ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవాలి. మొదట స్ట్రాంగ్ సెంట్స్ స్ప్రే చేసుకుని దానిపైన లైటర్ ఫ్రాగ్రెన్స్ వచ్చేవి వేసుకోవాలి. మీ శరీరంలోని ఉష్ణోగ్రతను బట్టి సెంట్స్ మీ శరీరంపై పనిచేసే తీరు ఉంటుంది. పాదాలు వాసన రాకుండా ఉండాలంటే వాటిపై టాల్కమ్ పౌడర్ ను తరచుగా చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాల్లోని చెమటను అది పీల్చుకుంటుంది. దీంతో చెమట పోయి పాదాలు దుర్వాసన రావు. పాదాలను తరచూ సోప్ వాటర్ తో శుభ్రం చేసుకుని నీటితో కడుక్కోవాలి. లేదా నీటితో తరచూ పాదాలను కడుక్కుంటుండాలి. ఇలా చేసినా కూడా పాదాలు దుర్వాసన రావు. కాటన్ బాల్స్ పై పెర్ఫ్యూమ్ చల్లి ప్లాస్టిక్ బ్యాగ్స్ లో పెట్టుకుంటే టచప్ప్ అవసరమైనపుడు వాటితో చేసుకోవచ్చు.

మీ పర్ఫ్యూమ్ ను వాష్ రూమ్ లో ఉంచొద్దు. ఎందుకంటే కాంతి, తేమ, ఉష్ణోగ్రతల్లో తేడాపాడాల వల్ల పెర్ప్యూమ్ దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో దాని నాణ్యత తగ్గుతుంది. అలాగే పర్ఫ్యూమ్ గాఢత కూడా తగ్గుతుంది. అందుకే పెర్ఫ్యూమ్స్ ని చల్లగా లేదా పొడిగా ఉన్న ప్రదేశాలలో భద్రం చేయాలి. సూర్యరశ్మి పడని చోట్ల మాత్రమే ఉంచాలి. అలాగే పర్ఫ్యూమ్ ను ఉపయోగించినపుడు షేక్ చేయకూడదు. అలా చేస్తే దాని లైఫ్ స్పాన్ తగ్గుతుంది. దాని గాఢత కూడా తగ్గుతుంది. వెంట్రుకలు చెమట వాసన రాకుండా ఉండాలంటే మీరు వాడే షాంపులో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి. జుట్టుకు డిజైన్ చేసిన హెయిర్ ఫ్ఱాగ్రెన్స్ నే స్ప్రే చేసుకోవాలి. ఇది మీ జుట్టును పొడాబారేలా చేయదు. మీరు వేసుకున్న వస్త్రాలు సువాసనలు చిందించాలంటే ఫ్యాబ్రిక్ డియొడరైజర్స్ వాడాలి. డ్రైయిడ్ లవండర్ లేదా వెనిలా వల్ల మీ బట్టలు మంచి సువాసనలను చిందిస్తాయి. పెర్ఫ్యూమ్ వాసనలు చిందించే కాటన్ బాల్స్ ను లేదా సెంటెడ్ షిష్యూ పేపర్లు కూడా మీరు వేసుకునే వస్త్రాలు సువాసనలు చిందేలా చేస్తాయి. బట్టలు
ఉతికేటప్పుడు ఆ నీళ్లల్లో పది నుంచి 20 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేస్తే బట్టలు పూల సుగంధాలను చిందిస్తాయి. మీరు వాడిన డిటర్జంట్ల వాసన బట్టలకు ఉండదు.

మీ నోరు దుర్వాసన రాకుండా ఉండాలంటే రోజుకు రెండుసార్లు దంతాలు శుభ్రంచేసుకోవాలి. నోరు వాసన వచ్చే ఆహార పదార్థాలు తింటే పళ్లు తోముకుంటే ఆ వాసన పోతుంది. మీ నోరు ఎండిపోకుండా తరచూ నీళ్లు తాగుతుంటే కూడా నోరు దుర్వాసన రాదు. పుదీనా ఆకుల్ని నమలడం లేదా నీళ్లల్లో వాటిని కలుపుకుని తాగడం వల్ల కూడా నోరు వాసన రాదు. తేలికపాటి సువాసనలు చిందించే సెంటెడ్ సబ్బులతో స్నానం చేస్తే శరీరం తేలిగ్గా ఉండి సువాసనలు చిందిస్తుంది. సహజసిద్ధమైన, సువాసనలు లేని ఉత్పత్తులను వాడితే చర్మం ఆరోగ్యంగా ఉండడంతో పాటు శరీరం తాజాదనంగా ఉంటుంది. అందుకే గాఢ సువాసనలు లేని ఫేష్ వాషులు, లోషన్లు, బాడీ వాష్ లు, హెయిర్ మాస్కలు, డియొడరెంట్లు, సన్ స్ర్కన్లు వాడితే శుభ్రంగా ఉంటుంది. ఈ టిప్స్ పాటిస్తే మీ శరీరం ఇరవైనాలుగు గంటలూ తాజాగా ఉండడమే కాదు మంచి సుగంధాలు చిందిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు మీరూ ఈ సీక్రెట్ టిప్స్ ఫాలో అయిపోండి…ఏమంటారు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News