Cherry Bnenefits: చెర్రీస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. చెర్రీ పండ్లు చూడటానికి చాలా అందంగా ఉన్న, వాటిలో ఉండే పోషకాలు అనేకం. ఇందులో ఉండే పోషకాలు అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారికి చెర్రీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని తినడం ద్వారా నిద్ర హాయిగా పడుతుంది.
అంతేకాదు, చర్మం మెరుపును పెంచడంలో కూడా చెర్రీస్ సహాయపడతాయి. చెర్రీస్‌లో అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలోపేతం చేస్తాయి. అలాగే, బరువు తగ్గాలనుకునే వారు కూడా చెర్రీస్ తినొచ్చు. ఈ నేపథ్యంలో చెర్రీస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
చెర్రీస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
చెర్రీస్ తినడం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి. అంతేకాదు వీటిని తింటే హార్ట్ బీట్ సాధారణంగా ఉంటుంది కూడా! చెర్రీస్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం నుంచి ఉపశమనం పొందొచ్చు.
ఈ పండు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. చెర్రీస్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. అంతేకాదు, ఇది చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. చర్మంపై సహజ కాంతిని తెస్తుంది.
Also read: Healthy Fruits: ఈ పండ్ల కలయికతో ఆరోగ్యం మటాష్..
మంచి నిద్ర కోసం చెర్రీస్ తినడం ప్రభావవంతంగా ఉంటుంది. చెర్రీస్ మెలటోనిన్ సహజ మూలం. ఫలితంగా నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు చెర్రీస్ ను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.
చెర్రీస్ తీసుకోవడం ఎముకలను బలోపేతం చేయడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. చెర్రీస్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలంగా చేస్తాయి. వీటిని చెర్రీస్ క్రమం తప్పకుండా తినడం వల్ల ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు చెర్రీస్ తినాలి. నిజానికి చెర్రీస్ కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. దీని కారణంగానే పదే పదే తినే అలవాటును నివారించవచ్చు. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు.
చెర్రీస్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చెర్రీస్‌లో విటమిన్లు ఎ, సి, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. చెర్రీస్ తినడం వల్ల కాలానుగుణ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


