Cardamom Water Benefits: అందరి వంటింట్లో కామన్ గా ఉండే ఆహార పదార్థాలలో యాలకులు ఒకటి. ఇది ఆహార వాసన, రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని అనేక సమస్యలను తొలగించడంలో సహాయపడుతాయి. వీటిని అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే నానబెట్టిన యాలకుల నీటిని ఖాళీ కడుపుతో తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? అవును ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ నీరు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన దినచర్య ఆరోగ్యంగా ఉండాలంటే యాలకుల నీరు తాగాల్సిందే. మరి ఆలస్యమెందుకు యాలకులు నీటిని తయారు చేసే విధానం, అది అందించే అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలంటే యాలకులు నీటిని తాగాలి. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ అంశాలు ఉంటాయి. ఇవి శరీర వ్యాధులతో పోరాడే సామర్ధ్యాన్ని పెంచుతాయి. మారుతున్న సీజన్లలో అనేక వ్యాధులను ఎదుర్కోవాలంటే ఈ నీటిని త్రాగాలి.
Also Read: Raisins Benefits: ఎండుద్రాక్షను ఇలా తింటే బోలెడు లాభాలు మీ సొంతం..
ఈ నీటిని తాగడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. ఇది కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో యాలకుల నీటిని తాగితే ఉపకాయం తగ్గుతుంది. అంతేకాకుండా ఈ నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది.
ఈ పానీయం రక్తపుటున అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే పొటాషియం, ఖనిజాలు అధిక రక్తపోటును సమతుల్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడతాయి. దీని క్రమం తప్పకుండా తాగడం ద్వారా గుండా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా గుండె పనితీరును మెరుగుపడుతుంది.
తరచుగా మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సమోసాలతో బాధపడుతుంటే యాలుకల నీరు అమృతంలా పనిచేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
యాలకుల నీటిని తయారు చేసే విధానం:
రాత్రిపూట ఒక గ్లాస్ నీటిలో 1-2 యాలకులు వేసి నానబెట్టాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఈ సుగంధ నీటిని త్రాగాలి. లేదా గోరువెచ్చని నీటిలో యాలకులు పొడిని కలిపి కూడా త్రాగవచ్చు.


