Chia Seeds: ఈరోజుల్లో చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి నేటి జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపావడం ప్రధాన కారణాలు. అందువల్ల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాంగా ఉండాలంటే పండ్లు, తాజా కూరగాయలు డైట్ లో ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యాంగా చేస్తాయి.
ఈ క్రమంలో చియా గింజల నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో శరీరానికి అవసరమైన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్తయి. ఫలితంగా అనేక అద్భుతమైన ఆరోగ్య లాభాలు పొందవచ్చు. ప్రతి ఉదయం చియా గింజల నీటిని తాగడం ప్రారంభిస్తే, శరీరంలో అనేక ముఖ్యమైన మార్పులను గమనించవచ్చు. ఇప్పుడు చియా గింజల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ALSO READ:Lingad vegetable: ఈ అడవి కూరగాయలో పోషకాలు అనేకం..కనిపిస్తే మాత్రం విడిచిపెట్టకుండా తెచ్చుకోండి..
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: చియా గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటికి నీటిలో నానబెట్టి తినేటప్పుడు, జెల్ లాంటి రూపంలో ఏర్పడుతాయి. ఇది పేగులను శుభ్రపరచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వీటిని రోజూ తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం కలుగుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది: బరువు తగ్గాలనుకునే వారికి చియా గింజల నీరు ఒక వరం. దీనిలోని ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. ఇది పదే పదే తినే అలవాటును నివారిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి.
ఎముకలు, దంతాలను బలపరుస్తుంది: చియా గింజలు మంచి మొత్తంలో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం కలిగి ఉంటాయి. ఈ ఖనిజాలు ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చియా నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎముకల బలాన్ని కాపాడుతుంది. వృద్ధాప్యంలో ఎముక బలహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యానికి ప్రయోజనాలు: చియా గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలం. ఇవి గుండె ఆరోగ్యానికి అవసరం. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చర్మం, జుట్టుకు ఉత్తమమైనది: చియా గింజలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ప్రతి ఉదయం చియా నీరు తాగడం వల్ల చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అదనంగా, విత్తనాలలో ఉండే ప్రోటీన్లు, ఖనిజాలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
చియా గింజల నీటిని ఎలా తయారు చేయాలి?
రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో 1-2 టీస్పూన్ల చియా విత్తనాలను నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే ఈ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో త్రాగాలి. కావాలనుకుంటే, రుచి కోసం దానికి నిమ్మరసం కూడా జోడించవచ్చు.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


