Goji Berries Benefits: గోజీ బెర్రీల గురించి చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు. ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలోని ఉండే అనేక పోషకాల కారణంగా ఇది సూపర్‌ఫుడ్స్ గా గుర్తింపు పొందింది. ఇవి చైనాలో ఎక్కువగా పండుతాయి. చైనీయులు గోజీ బెర్రీల చిరుతిండిగా ఉపయోగిస్తారు. ఇవి కొద్దిగా పుల్లని-తీపి రుచిని కలిగి ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అనేకం. వీటిలో ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపు నుంచి మానసిక ఆరోగ్యం వరకు మేలు చేస్తాయి. ఇప్పుడు గోజీ బెర్రీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
కంటి చూపు: గోజీ బెర్రీలలో జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో, రెటీనా దెబ్బతినకుండా రక్షించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
రోగనిరోధక శక్తి: వీటిలో ఉండే విటమిన్లు సి, ఎ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వైరల్ ఇన్ఫెక్షన్ల, కాలానుగుణ వ్యాధుల నుండి రక్షిస్తాయి.
చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది: గోజీ బెర్రీలలో యాంటీ-ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని ముడతల నుండి కాపాడుతాయి. మెరిసే చర్మాన్ని అందిస్తాయి.
గుండెను ఆరోగ్యం: ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: గోజీ బెర్రీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
డయాబెటిస్: వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటయి. టైప్ 2 డయాబెటిస్ రోగులకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి.
బరువు తగ్గడం: కేలరీలు తక్కువగా ఉండటం, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇవి పదే పదే తినే అలవాటును నిరోధిస్తుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి.
మానసిక ఆరోగ్యం: తరచుగా తింటే తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది.
శక్తిని పెంచుతుంది: గోజీ బెర్రీలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. కావున రోజంతా శక్తివంతంగా, చురుగా ఉండవచ్చు.
లివర్ డీటాక్స్: చైనీస్ వైద్యంలో దీనిని కాలేయ నిర్విషీకరణగా ఉపయోగిస్తారు. కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. గోజీ బెర్రీలను క్రమం తప్పకుండా మితంగా తీసుకోవడం మంచిది. వీటిని స్నాక్స్, స్మూతీస్, సలాడ్‌లు లేదా టీలలో చేర్చడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు.


