Ivy Gourd Health Benefits: కూరగాయలు ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వాటిలో కొన్ని రకాల కూరగాయలు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. ఒక్కో కూరగాయలో ఒక్కో రకమైన పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అద్భుతంగా ఉంటాయి. అలాంటి కూరగాయలలో దొండకాయ ఒకటి. దీనిలో సూపర్ ఫుడ్ వంటి అనేక లక్షణాలు దాగి ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దొండకాయలో ఉండే విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఈ క్రమంలో దొండకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దొండకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
మధుమేహం
డయాబెటిస్ తో బాధపడుతుంటే, ఆహారంలో దొండకాయ ఉండేటట్లు చూసుకోవాలి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి దొండకాయ వినియోగం ప్రయోజనం చేకూరుస్తుంది.
Also Read: Health Tips: 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవే..
ఊబకాయం
ఊబకాయం, త్వరగా బరువు తగ్గాలనుకుంటే దొండకాయను డైట్ లో చేర్చుకోండి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కేలరీలు తక్కువగా నీరు, ఫైబర్ అధికంగా ఉండే ఈ కూరగాయను తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు.
రక్తహీనత నివారణ
రక్తహీనతతో ఇబ్బందిపడుతున్నవారు దొండకాయ తప్పనిసరిగా తినాలి. శరీరంలో ఐరన్ లేకపోవడం వల్ల బలహీనత, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే, దొండకాయలో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడం ద్వారా రక్తహీనతను నివారిస్తుంది.
కడుపు ఆరోగ్యం
దొండకాయలో ఉండే అధిక మొత్తంలో ఫైబర్ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. దీని కారణంగా అజీర్ణం లేదా మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. దీనితో పాటు దొండకాయ పైల్స్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధిలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం
దొండకాయలో సోడియం తక్కువగా, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు దొండకాయ ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


