Sunday, February 8, 2026
Homeహెల్త్PopCorn: టైమ్ పాస్ కోసం పాప్ కార్న్ తింటున్నారా..? ఈ ఐదు ఆరోగ్య లాభాలు తెలిస్తే...

PopCorn: టైమ్ పాస్ కోసం పాప్ కార్న్ తింటున్నారా..? ఈ ఐదు ఆరోగ్య లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

PopCorn Health Benefits: వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఆహారపదార్థాలలో పాపా కార్న్ ఒకటి. సినిమా అనగానే వెంటనే గుర్తొచ్చేది పాప్ కార్న్. అయితే పాప్ కార్న్ తినడం ద్వారా కేవలం టైమ్ పాస్ మాత్రమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఎప్పుడైనా, ఎక్కడైన తినవచ్చు. పాప్‌కార్న్‌లో అనేక ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. ఇవి వివిధ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ క్రమంలో పాప్‌కార్న్ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

- Advertisement -

బరువు తగ్గడానికి మంచిది
బరువు తగ్గాలనుకునేవారు దేనిని స్నాక్ గా తినాలో అర్థం కాదు. కానీ, బరువు తగ్గడానికి ఇది గొప్ప చిరుతిండి. ఇందులో ఎక్కువ మొత్తంలో పీచుపదార్థాలు ఉంటాయి. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. పైగా పాప్ కార్న్ లో అదనపు చక్కెర కూడా ఉండదు. దీనిలో ఉండే ఫెరులిక్ యాసిడ్ అనే పాలీఫెనాల్ ఊబకాయంతో పోరాడటానికి సహాయపడుతుంది. కాగా, ఒక కప్పు పాప్ కార్న్ లో కేవలం 30 కేలరీలు ఉంటాయి.

also read:Lava Blaze Duo 3 Launched: డ్యూయల్ డిస్‌ప్లేతో లావా బ్లేజ్ డుయో 3 వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ.16,999 మాత్రమే!

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో
మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి పాప్‌కార్న్ చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఎందుకంటే పాప్‌కార్న్‌లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పైగా హెచ్చుతగ్గులకు గురికాకుండా నిరోధిస్తుంది. కాబట్టి, దిగాబెస్ట్స్ ఉన్నవారు దీన్ని ఖచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి.

గుండె ఆరోగ్యానికి మంచిది
గుండె సమస్యలు ఉన్నవారికి పాప్‌కార్న్ ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పవచ్చు. పాప్‌కార్న్‌లోని ఉండే పీచు పదార్థాలు ధమనుల గోడల్లో పేరుకుపోయిన కొవ్వుని తగ్గిస్తాయి. దీని వలన శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. తద్వారా గుండెపోటు, స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

జీర్ణక్రియకు ప్రయోజనకరమైనది
తరచుగా కడుపు సమస్యలతో బాధపడుతుంటే, ఆహారంలో పాప్‌కార్న్‌ను చేర్చుకోవచ్చు. పాప్‌కార్న్‌లోని ఫైబర్ ప్రేగులలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా, ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడమే కాకుండా గట్ మైక్రోబయోమ్, గట్‌లో నివసించే మంచి బ్యాక్టీరియాకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
క్యాన్సర్ రోగులకు పాప్‌కార్న్ ప్రయోజనకరంగా ఉంటుంది. పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News