Saturday, November 23, 2024
Homeహెల్త్Anti-Acne diet: యాక్నేను తగ్గించే డైట్

Anti-Acne diet: యాక్నేను తగ్గించే డైట్

పింపుల్స్ రాగానే బెదిరిపోకండి, మీరు ప్రశాంతంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే సరి

యాక్నే సమస్యను చాలామంది ఎదుర్కోవడం చూస్తున్నాం. చర్మం అడుగున ఉండే నూనె గ్రంధులకు కనెక్టయి ఉండే చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల యాక్నే సమస్య ఎదురవుతుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల చర్మంపై బాక్టీరియా, మ్రుతకణాలు, నూనె పెద్దమొత్తంలో చేరతాయి. అవి కాస్తా వాపుగా, ఆతర్వాత యాక్నేగా మారతాయి. జన్యు, హార్మోన్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా యాక్నే ఏర్పడుతుంది. యాక్నేలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వైట్ హెడ్స్ అంటే మొటిమలు. రెండవది బ్లాక్ హెడ్స్ . ఇవి చర్మంపై నల్లని మచ్చలుగా ఏర్పడతాయి.

- Advertisement -

ఈ చర్మ సమస్య తలెత్తడానికి డైట్ విషయంలో మనం చేస్తున్న కొన్ని తప్పులు ప్రధాన కారణమంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉన్న ఆహారపదార్థాలు తినడం వల్ల బ్లడ్ షుగర్ ప్రమాణాలు వేగంగా పెరుగుతాయి. అది వాపుకు, చర్మంపై యాక్నే ఏర్పడడానికి కారణమవుతాయి. అందుకే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లను తినకూడదు. అలాగే బాగా ప్రోసెస్ చేసిన వైట్ బ్రెడ్, పాస్తా, మెకరోని, జున్నులకు దూరంగా ఉండాలి. వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటిల్లో చెడుకొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతాయి. దీంతో రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటిని తరచూ తింటే ఆరోగ్యానికి కీడు చేస్తాయి. అలాగే పాలు, పాల ఉత్పత్తులు బాగా తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రమాణాలు బాగా పెరుగుతాయి. చర్మంపై మొటిమలు అధికంగా వస్తాయి. పాలల్లో ఉండే గ్రోత్ హార్మోన్ల వల్ల కూడా శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అంతేకాదు ఎక్కువ నూనె సైతం ఉత్పత్తి అవుతుంది. ఇక రిఫైన్డ్ షుగర విషయానికి వస్తే దాని జోలికి పోకుండా ఉండడమే సర్వోత్తమం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది యాక్నేకి కారణమైన వాపు, హార్మోన్ల సమస్యలకు దారితీస్తుంది. తాజా పండ్లలో ఉండే సహజ చక్కెర గుణాల వల్ల ఎలాంటి హాని ఉండదు కానీ డెజర్టులు, కుక్కీస్, చాక్లెట్లల్లో వాడే ప్రోసెస్డ్ చక్కెర వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చర్మం ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు హోల్ వీట్ రోటీ, బ్రౌన్ బ్రెడ్, రాగి వంటి హోల్ గ్రెయిన్స్ అలాంటివే. వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మంచివి. తాజా పండ్లు, కూరగాయలను బాగా తినాలి. ఎందుకంటే వీటిల్లో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరారోగ్యాన్నే కాదు రోగనిరోధక శక్తిని సైతం పెంపొందిస్తాయి. చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల కూడా చర్మ ఆరోగ్యంగా ఉంటుంది. నెయ్యి, నట్స్, గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సూక్ష్మ పోషకాలైన జింక్ మెగ్నీషియం, సెలేనియం వంటి వాటి వల్ల చర్మం ఆరోగ్యంగా, మరెంతో ప్రకాశవంతంగా తయారవుతుంది. నట్స్, సీడ్స్ లను నీళ్లల్లో నానబెట్టుకుని తినడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఎలాంటి శారీరక అసౌకర్యం అనిపించదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News