యాపిల్ సిడార్ వెనిగర్ తో బ్యూటీ..
చర్మం, గోళ్లు, జుట్టు, దంతాల అందాలకు, ఆరోగ్యానికి యాపిల్ సిడార్ వెనిగర్ బాగా పనిచేస్తిం. వంటల్లో, మందుల్లో సైతం యాపిల్ సిడార్ వెనిగర్ ను వాడతారు. యాపిల్ సిడార్ వెనిగర్ లో సహజసిద్ధమన యాసిడ్స్, యాంటాక్సిడెంట్లు, న్యూట్రియంట్లు ఉన్నాయి జలుబు, జీర్ణశక్తి సమస్యలు, రకరకాల ఇన్ఫెక్షన్ల తగ్గుదల కోసం కూడా . దీన్ని వాడతారు.
యాక్నేతో బాధపడేవారికి కూడా యాపిల్ సిడార్ వెనిగర్ ఎంతో సాంత్వననిస్తుంది. తగ్గిస్తుంది. సన్ బర్న్స్, పిగ్మెంట్ స్పాట్స్, ఇతర చర్మ సంబంధమైన సమస్యల నుంచి కూడా యాపిల్ సిడార్ వెనిగర్ సాంత్వననిస్తుంది. బ్యూటీ విషయానికి వస్తే, చర్మంపై ఏర్పడ్డ ముడతలు పోగొట్టడంలో యాపిల్ సిడార్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. యాపిల్ సిడార్ లోని ఎసిటిక్ యాసిడ్, యాంటాక్సిడెంట్లు చర్మం సహజసిద్ధమైన పిహెచ్ బ్యాలెన్స్ ను పునరుద్ధరిస్తుంది.
చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ ను రెడీ పెట్టుకోవాలి. యాపిల్ సిడార్ వెనిగర్, తాజా నిమ్మరసం రెండింటినీ ఒక బౌల్ లో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని కొన్ని నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోని మాయిశ్చరైజర్ ని పట్టించాలి.
యాపిల్ సిడార్ వెనిగర్ మౌత్ వాష్ లా కూడా ఉపయోగపడుతుంది. దంతక్షయం కాకుండా కూడా యాపిల్
సిడార్ పనిచేస్తుంది.బాక్టీరియా వల్ల దంతాలపై ఏర్పడే పచ్చటి పొరను తగ్గిస్తుంది. నోరు దుర్వాసన రాకుండా సంరక్షిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్, ఒక టీస్పూన్ ఉప్పు, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు రెడీ పెట్టుకోవాలి. గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో యాపిల్ సిడార్ వెనిగర్, ఉప్పులను వేసి బాగా కలపాలి. దంతాలు శుభ్రం చేసుకున్న తర్వాత ఈ సొల్యూషన్ తో నోరు శుభ్రంగా కడుక్కుంటే నోటి దుర్వాసన ఉండదు.
జుట్టుకు కూడా యాపిల్ సిడార్ వెనిగర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టును మెరిసేలా, ఆరోగ్యంగా ఉండేలా యాపిల్ సిడార్ వెనిగర్ సహాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ రెడీ పెట్టుకోవాలి.ఈ పదార్థాలను కలిపి మిశ్రమంలా చేయాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత షాంపుతో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆలివ్ ఆయిల్
జిడ్డుతనం వెంట్రుకలకు ఉండకుండా పోతుంది. వెంట్రుకల్లో చేరిన చుండ్రును కూడా యాపిల్ సిడార్ వెనిగర్ పోగొడుతుంది. యాపిల్ సిడార్ వెనిగర్ వాడడం వల్ల ఫంగల్మైక్రోఆర్గానిజమ్స్ నశించిడమే కాదు ఇన్ఫెక్షన్ల బారిన కూడా పడరు. మూడు టేబుల్ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్, అర కప్పు నీళ్లు, ఆరు చుక్కల టీ ట్రీ ఆయిల్ సిద్ధంగా పెట్టుకోవాలి.
ఒక బౌల్ తీసుకుని అందులో ఈ పదార్థాలన్నింటి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కొన్ని నిమిషాల పాటు మాడుకు సున్నితంగా మసాజ్ చేస్తు పట్టించాలి. పదినిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో తలను శుభ్రం చేసుకోవాలి. యాక్నే చికిత్సలో కూడా యాపిల్ సిడార్ వెనిగర్ వాతారు. యాపిల్ సిడార్ చర్మం నేచురల్ పిహెచ్ బ్యాలెన్స్ ను మళ్లా తేవడమే కాకుండా బాక్టీరియా, ఇన్ఫ్లమేషన్ల నుంచి సైతం చర్మాన్ని కాపాడుతుంది. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్, నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లు, కాటన్ ప్యాడ్ రెడీ చేసుకోవాలి. చెప్పిన పరిమాణంలో నీటిని తీసుకుని అందులో యాపిల్ సిడార్ వెనిగర్ ను వేసి బాగా కలపాలి. ఆ సొల్యూషన్ లో దూదని ముంచి దాన్ని చర్మ సమస్యలు ఉన్న చర్మ భాగంపై అప్లై చేయాలి.
సన్ బర్న్ ల నొప్పి నుంచి కూడా యాపిల్ సిడార్ వెనిగర్ మనల్ని సంరక్షిస్తుంది.
ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్, పావు గ్లాసు నీళ్లు, ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకోవాలి. నీళ్లల్లో యాపిల్ సిడార్ వెనిగర్ వేసి అది కలిసిపోయేంతవరకూ కలపాలి. శుభ్రమైన చిన్న వస్త్రాన్ని తీసుకుని దాన్ని ఆ సొల్యూషన్ లో కాసేపు నాననివ్వాలి. చర్మానికి యాపిల్ సిడార్ వెనిగర్ అప్లై చేసుకునేటప్పుడు దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి పలుచగా చేసుకోవాలి. దీని వల్ల చర్మం ఇరిటేషన్ ఉండదు. అంతేకాదు చర్మం అందంగా, హెల్దీగా ఉంటుంది.