Saturday, November 15, 2025
Homeహెల్త్Apple Cider Vinega: యాపిల్ సిడార్ వెనిగర్–మునగ డ్రింక్ ఆరోగ్య రహస్యాల గురించి మీకు తెలుసా!

Apple Cider Vinega: యాపిల్ సిడార్ వెనిగర్–మునగ డ్రింక్ ఆరోగ్య రహస్యాల గురించి మీకు తెలుసా!

Apple Cider Vinega-Moringa Drink: ఆరోగ్యానికి సహజమైన మార్గాలను వెతుకుతున్నవారిలో యాపిల్ సిడార్ వెనిగర్ మునగ డ్రింక్ కొత్త ఆకర్షణగా మారింది. ఈ మిశ్రమాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గించుకోవాలనుకునేవారికి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవాలనుకునేవారికి, గట్ హెల్త్ మెరుగుపరచుకోవాలనుకునేవారికి ఇది సహజమైన పరిష్కారంగా మారుతోంది. వెల్నెస్ ప్రపంచంలో పసుపు లాటేలు, అశ్వగంధా సప్లిమెంట్లు వంటి ట్రెండ్స్ పెరిగినట్లే ఇప్పుడు ఈ డ్రింక్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది.

- Advertisement -

యాపిల్ సిడార్ వెనిగర్..

ఈ మిశ్రమం ప్రధానంగా రెండు పదార్థాలతో తయారవుతుంది. మొదటిది యాపిల్ సిడార్ వెనిగర్, ఇది ఆపిల్స్‌ను ఫెర్మెంటేషన్ చేసి తయారు చేస్తారు. ఇందులో ఉండే ఎసిటిక్ యాసిడ్ జీర్ణక్రియ సజావుగా జరగడానికి తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో, కొవ్వు మెటబాలిజాన్ని సపోర్ట్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. రెండవ పదార్థం మునగ ఆకుల పొడి. దీనిలో విటమిన్ A, C, Eలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్య ఖనిజాలు ఉంటాయి. యాంటాక్సిడెంట్లతో నిండిన ఈ మునగ పొడి శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

బరువు తగ్గించుకోవడంలో..

ఈ రెండు పదార్థాలు కలిసినప్పుడు తక్కువ కాలరీలతో కానీ అధిక పోషక విలువలతో కూడిన ఒక శక్తివంతమైన డ్రింక్ సిద్ధమవుతుంది. దీన్ని ప్రతిరోజు ఆరోగ్య చట్రంలో చేర్చుకుంటే శరీరానికి శక్తి పెరుగుతుంది, బరువు తగ్గించుకోవడంలో సులభతరం అవుతుంది. ఈ మిశ్రమం శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

ఊబకాయాన్ని తగ్గించడంలో..

యాపిల్ సిడార్ వెనిగర్ వల్ల లభించే ప్రయోజనాలు అనేకం. ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కణాలను రక్షిస్తాయి. లిపిడ్ స్థాయిలను సర్దుబాటు చేస్తుంది. కాలేయం సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. ఇదే సమయంలో మునగను ‘మిరకిల్ ట్రీ’ అని పిలుస్తారు. మునగ ఆకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ శక్తులను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్లు శరీరానికి థెరప్యూటిక్ గుణాలు అందిస్తాయి.

కొవ్వు కరిగించడంలో..

మునగ ఆకుల్లో కొవ్వు కరిగించడంలో సహాయపడే లక్షణాలు ఉన్నాయి. వీటి వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఊబకాయం నిపుణుల ప్రకారం, వెయిట్ మేనేజ్మెంట్‌లో మునగ ముఖ్య పాత్ర పోషిస్తుంది. లివర్ డిటాక్స్ చేయడంలో కూడా ఇది ఉపకరిస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. మునగలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కాలేయాన్ని శుభ్రపరచడంలో దోహదం చేస్తాయి. అదేవిధంగా క్రేవింగ్స్ తగ్గించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది.

ఈ డ్రింక్ తయారు చేయడం చాలా సులభం. ఒక కప్పు గోరువెచ్చటి నీటిలో ఒక స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్, అర స్పూన్ మునగ పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు మూడు నిమిషాలు ఉంచి తర్వాత తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఉత్తమం. లేదంటే భోజనం చేసే ముందు అరగంట ముందు తాగినా మంచిదే. రుచి కోసం కొద్దిగా తేనె, బెల్లం లేదా నిమ్మరసం కలపవచ్చు. కొంతమంది దాల్చినచెక్క పొడి వేసుకుని కూడా తాగుతారు.

Also Read: https://teluguprabha.net/health-fitness/migraine-causes-myths-symptoms-and-prevention-explained/

ఎంత కాలం తీసుకోవాలన్నది వ్యక్తి జీవనశైలి, డైట్, మెటబాలిజం మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి వారం రోజులలోనే ఫలితాలు కనిపించవచ్చు. కడుపు ఉబ్బరం తగ్గిపోవడం, జీర్ణక్రియ మెరుగుపడటం త్వరగా కనిపిస్తుంది. మరికొందరికి చర్మంలో మార్పులు రావడానికి, బరువు తగ్గడంలో ఫలితాలు కనపడటానికి కొన్నినెలలు పట్టవచ్చు. ఈ డ్రింక్‌తో పాటు సమతులాహారం, వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే సరైన ఫలితాలు లభిస్తాయి.

అయితే ఈ డ్రింక్‌ను అతిగా తీసుకుంటే సమస్యలు తలెత్తవచ్చు. పలచగా చేయని యాపిల్ సిడార్ వెనిగర్ దంతాల ఎనామెల్‌ను దెబ్బతీయవచ్చు. పళ్లు సెన్సిటివ్‌గా మారుతాయి. ఎసిడిటీ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మునగ పొడి అధికంగా తీసుకుంటే లాక్సేటివ్‌లా పనిచేస్తుంది. మునగలో ఉండే కొన్ని పదార్థాలు గర్భాశయంపై ప్రభావం చూపవచ్చు. ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే కిడ్నీ, రక్తపోటుపై కూడా ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. కొందరికి దద్దుర్లు, శ్వాస సమస్యలు తలెత్తవచ్చు.

Also Read:https://teluguprabha.net/health-fitness/daily-raw-tomato-boosts-heart-skin-and-bone-health/

అందువల్ల ఈ డ్రింక్‌ను పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకున్న తరువాత మాత్రమే దీన్ని ప్రారంభించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad