యాపిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పండించే.. అత్యంత ప్రాచుర్యం పొందిన పండు. యాపిల్ రుచికరమైనదే కాకుండా, పోషకాలతో నిండి ఉంటుంది.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి కలిగి ఉంది. రోజువారీ ఆహారంలో యాపిల్‌ను చేర్చుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగవడంతో పాటు, బరువు నియంత్రణ, క్యాన్సర్ నిరోధకత వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు యాపిల్ తినే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మరి యాపిల్ ఎవరికెంత ఉపయోగకరంగా ఉంటుంది.. ఎవరు తినకూడదు.. తెలుసుకుందాం.
యాపిల్ రోసేసి కుటుంబానికి చెందిన పండు. మాలస్ డోమెస్టికా అనే శాస్త్రీయ నామం ఉంది. సాధారణంగా గుండ్రంగా లేదా అండాకారంలో ఉండే యాపిల్స్ ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో కనిపిస్తాయి. ఇవి విటమిన్లు సీ, కెతో పాటు .. పోటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయంట. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించేందుకు సహాయపడతాయి.
యాపిల్ ఆరోగ్య ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యం: యాపిల్స్‌లోని ఫ్లేవనాయిడ్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడతాయి.
జీర్ణ వ్యవస్థకు మేలు: ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది.
బరువు నియంత్రణ: తక్కువ కేలరీలతో పాటు, పొట్ట నిండిన అనుభూతిని కలిగించడం వల్ల అధిక బరువు సమస్యను తగ్గించేందుకు యాపిల్ సహాయపడుతుంది.
క్యాన్సర్ రిస్క్ తగ్గింపు: కొన్ని అధ్యయనాలు యాపిల్స్‌లోని పోషకాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నాయి.
యాపిల్ తినకూడని వారు ఎవరు?
అందరికీ మేలు చేసే యాపిల్, కొంతమందికి అనుకూలంగా ఉండకపోవచ్చు.
అలెర్జీ ఉన్నవారు: యాపిల్‌లోని మాలిక్ యాసిడ్ కొన్ని వ్యక్తుల్లో అలెర్జీకి కారణమవుతుంది.
IBS ఉన్నవారు: అతి ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల కొంతమందికి కడుపు నొప్పిని కలిగించవచ్చు.
కొన్ని మందులు వాడేవారు: యాపిల్, కొన్ని ఔషధాల ప్రభావాన్ని మార్చే అవకాశముంది.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు: ఇందులో అధికంగా ఉండే పొటాషియం, కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపవచ్చు.
“రోజూ యాపిల్ తింటే వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన పని లేదు.. అనే నానుడి ఉంది.. నిజంగానే యాపిల్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే మీకు ప్రత్యేక ఆనారోగ్య సమస్యలు ఉంటే.. యాపిల్ తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా యాపిల్‌ను మీ డైట్‌లో చేర్చండి.