Sunday, July 7, 2024
Homeహెల్త్How to apply Hair oil?: అతిగా ఆయిల్ పెడితే జుట్టు రాలుతుంది!

How to apply Hair oil?: అతిగా ఆయిల్ పెడితే జుట్టు రాలుతుంది!

మర్ధన చేయండి, రిలాక్స్ అవ్వండి, జుట్టు కూడా పెరుగుతుంది

వెంట్రుకలకు ఎలా నూనె పట్టిస్తున్నారు?

- Advertisement -

శిరోజాలు ఆరోగ్యంగా ఉంటే జుట్టు బలంగా ఉంటుంది. తలకు నూనె పట్టించే తీరును బట్టి కూడా శిరోజాల పటుత్వం ఉంటుంది. అందుకే నూనెను తలకు ఎలా రాసుకుంటున్నారన్నది కూడా ఎంతో ముఖ్యమైంది. హెయిర్ ఆయిల్స్ ని సరైన విధానంలో జట్టుకు పట్టిస్తే ఫలితాలు బాగుంటాయంటున్నారు శిరోజాల నిపుణులు. నూనెను మాడుకు ఎక్కువగా పట్టించడం మంచిది కాదంటున్నారు.

వెంట్రుకలకు ఆయిల్ సరిగా పెడితే జుట్టు పెరుగుదల కూడా బాగా ఉంటుందని చెపుతున్నారు. నూనె పెట్టడం వల్ల వెంట్రుకలకు సరిపడా మాయిశ్చరైజర్ అందుతుంది. జుట్టు మెరుస్తూ ఉంటుంది. డ్రై స్కాల్ప్, జుట్టు పీచులా ఉండడం వంటి సమస్యలు తలెత్తవు.  అందుకే చర్మానికి మాయిశ్చరైజర్ ఎలా అవసరమో, జుట్టుకు నూనె రాసుకోవడం కూడా అంతే అవసరం. హెయిర్ ఆయిల్స్ లో ఎసెన్షియల్ న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను సరళం చేస్తాయి. జుట్టు పాయలన్నింటికీ మాయిశ్చరైజర్ అందుతుంది. దీంతో వెంట్రుకలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టుకు ఆయిల్ పెట్టడంవల్ల జుట్టు మెరవడమే కాదు దాని పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. కుదుళ్లు బలంగా అవుతాయి. పర్యావరణ పరమైన సమస్యల బారిన అంటే దుమ్ము, ధూళి వంటివి వెంట్రుకలను బాధించవు.  అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం వంటివి జుట్టుపై ప్రభావం చూపవు. అంతేకాదు జుట్టు పొడిబారకుండా ఉంటుంది.  

హెయిర్  ఆయిల్ వల్ల పూర్తి ప్రయోజనాలను పొందాలంటే మాత్రం వెంట్రుకలకు వాటిని సరిగా రాసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు శిరోజాల నిపుణులు. మీరు నిత్యం వాడే ఎసెన్షియల్ ఆయిల్ నే రాసుకోండి. మాడు సమస్యలను ముఖ్యంగా పొడిమారడం, పొట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తకుండా మీరు రాసుకునే ఆయిల్స్ సహాయపడాలి. మీరు రాసుకునే నూనె జుట్టు పెరుగుదలకు మాత్రమే కాదు వెంట్రుకలను పట్టులా మెరిపించాలి కూడా. జుట్టు కుదుళ్లను బలోపేతం చేయాలి. హెయిర్ ఆయిల్ సుగుణాలను పరిక్షించి మీ జుట్టుకు అవసరమైన నాణ్యమైన ఎసెన్షియల్ ఆయిల్ ను ఎంచుకోవాలి. టీ ట్రీ ఆయిల్, లవెండర్, పెప్పర్మెంట్, రోజ్ , జాస్మిన్, లెమన్, శాండల్ వుడ్ ఎసెన్షియల్ ఆయిల్స్ వంటివి ఎన్నో ఉన్నాయి. ఇవి శిరోజాల సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎసెన్షియల్ ఆయిల్స్ కాన్సెట్రేటెడ్ ఆయిల్స్. వీటిని మీరు నిత్యం వాడే కెరియర్ ఆయిల్ లో కలుపుకుని ఉపయోగించాలి.

  ఆరు టీస్పూన్ల కేరియర్ ఆయిల్ కి పదిహేను చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వాడాలి. 3 శాతం డైల్యూషన్ ఉంటే 20 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్స్ వాడాలి. తక్కువ రేషియోతో మొదలెట్టడం బెస్టు. తలకు నూనె రాసుకునే ముందర దానిని గోరువెచ్చగా వేడిచేసి ఆ తర్వాత తలకు పట్టించుకోవాలి. ఇలా చేయడం వల్ల నూనె మాడులోపలి కంటా ఇంకుతుంది. దీనివల్ల మాడు మాయిశ్చరైజర్ బాగా ఉంటుంది. ఆయిల్స్ ను నేరుగా స్టవ్ మీద పెట్టి వేడి చేయొద్దు. వేడి నీళ్లల్లో ఈ ఆయిల్స్ ను పెట్టి  గోరువెచ్చగా చేసుకుని తర్వాత దాన్ని తలకు రాసుకోవాలి. నూనె తలకు రాసుకునేటప్పుడు మాడును పది పదిహేను నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుంటూ నూనె రాసుకోవాలి. అలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు పటిష్టం అవుతాయి. మాడుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

  తలనొప్పి నుంచి సాంత్వన నివ్వడమే కాకుండా ఎంతో రిలాక్సేషన్ కూడా ఇస్తుంది. తర్వాత మీ ఆవిరిపట్టిన తువ్వాలుతో చుట్టి తలపై ముడేయాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన, దెబ్బతిన్న వెంట్రుకలు ఆరోగ్యంగా అవుతాయి. జుట్టుకు కావలసినంత మాయిశ్చరైజర్ని అందిస్తాయి. తలకు నూనె రాసుకున్న తర్వాత రెండుగంటల పాటు జుట్టును అలాగే వదిలేయాలి. ఆ తరవాత మైల్డ్ షాంపుతో తలను రుద్దుకోవాలి.  వెంట్రుకలను ఎక్కువ సేపు అలాగే వదలొద్దు . అలా చేస్తే దుమ్ము వంటివి జుట్టులో మళ్లా చేరొచ్చు. మీ వెంట్రుకలను రెగ్యులర్ వాటర్ లేదా చల్లటి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. వెంట్రుకలకు నూనె రాసుకున్నప్పుడు అన్ని రకాల హెయిర్స్ కు ఒకేరకమైన సమయంపాటు జుట్టును వదలాల్సిన అవసరం లేదు. నూనె రాసుకుని రాత్రంతా అలాగే జుట్టును వదిలేయడమంటే దానికి ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది.

రంధ్రాలు మూసుకుపోవడంతో పాటు జుట్టులో, మాడుపై ఎక్కువ దుమ్ము, జిడ్డు అవీ చేరే అవకాశం ఉంది. అందుకే నూనె రాసుకున్న జుట్టును రెండు నుంచి నాలుగు గంటల మించి వదలనవసరం లేదని శిరోజాల నిపుణులు చెపుతున్నారు. నూనె రాసుకన్న రోజే తలస్నానం చేయొచ్చు.

అయితే నూనె రాసిన తర్వాత జుట్టును కనీసం ఒకటి లేదా రెండు గంటల పాటు కనీసం ఉంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మురికిగా ఉన్న వెంట్రుకలకు ఎట్టి పరిస్థితుల్లో నూనెను అప్లై చేయకూడదు. మురికిగా ఉన్న వెంట్రుకలకు, మాడుకు నూనె రాస్తే ఆయిల్ మరింత జుట్టులో పేరుకుంటుంది. రంధ్రాలు మూసుకుపోతాయి. మట్టి అంతా జుట్టులో చేరుతుంది. దీంతో జుట్టు చిట్లే అవకాశం కూడా ఉంది. తడి, పొడి వెంట్రుకలకు ఆయిల్ అప్లై చేయొచ్చు. అయితే ఫలితాలు మటుకు వేరు వేరుగా ఉంటాయంటున్నారు శిరోజాల నిపుణులు.  తడి జుట్టుకు ఆయిల్ రాయడంవల్ల ఆయిల్ జుట్టు కుదుళ్లల్లోకి వెళ్లలేదు. అయితే తడి జుట్టుకు ఆయిల్ పెట్టడం వల్ల వెంట్రుకల చిక్కు సులభంగా పోతుంది.

హీట్ స్టైలింగ్ టూల్స్ నుంచి రక్షణ ఉంటుంది. పొడి జుట్టు మీద నూనె రాసుకుంటే జుట్టుకు షైన్ వస్తుంది. అతినీలలోహితకిరణాల నుంచి జుట్టుకు రక్షణ లభిస్తుంది. అలాగే కాలుష్య ప్రభావం వెంట్రుకల మీద పడదు కూడా. అంతేకాదు పొడి జుట్టు నూనెను బాగా గ్రహిస్తుంది. అయితే మీరు ఎలాంటి నూనెను, ఎంత తరచుగా ఉపయోగిస్తునారన్న అంశాలు కూడా శిరోజాల ఆరోగ్యంలో ఎంతో ప్రాధాన్యం వహిస్తాయి. జుట్టుతో పాటు జుట్టు ఆరోగ్యం బాగుండడానికి సహజసిద్ధమైన ఆయిల్స్ ను మాడు విడుదల చేస్తుంది. మాడుపై ఎక్కువ నూనెను అప్లై చేయడం వల్ల ఆ నేచురల్ సైకిల్ దెబ్బతినడంతో పాటు జుట్టు జిడ్డుగా తయారవుతుంది.

 ఎక్కువ ఆయిల్ పెట్టడం వల్ల రంధ్రాలు మూసుకుపోతాయి. జుట్టు పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది. జుట్టు బాగా రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News