అరటి పండుకు మన దేశంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. శుభకార్యాల దగ్గరి నుంచి తాంబూలాల వరకు అరటిపండు ఉండాల్సిందే. శరీరంలో నిస్సత్తువ పోగొట్టి తక్షణ శక్తినిచ్చే అరటిపండును ప్రయోజనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పేదవాడి యాపిల్ గా పేరున్న ఈ పండు ఎంతో చవకగా మార్కెట్లో దొరుకుతుంది. అంతేకాదు అరటి ఆకుల్లో భోజనం చేయడం ఎంతో మంచిదని మన పూర్వీకులు, వైద్యులు చెబుతుంటారు. ఇక పెళ్లికి, పార్టీకి, ఫంక్షన్ కి వెళ్లినప్పుడల్లా భోజనం చేసిన తర్వాత అరటిపండు వడ్డించడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీ. ఎందుకంటే అరటిపండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుకోవడానికి అరటిపండును ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ ధరకే లభించే అరటి పండు.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. భోజనం తర్వాత అరటిపండు తినడం చాలా మందికి అలవాటు. అరటిపండును కొంతమంది ఫ్రూట్ సలాడ్, జ్యూస్, దేవుడికి నైవేద్యంగా ఇలా రకరకాలుగా ఉపయోగిస్తారు. అరటిపండ్లు ఆరోగ్యంపై రక్షిత ప్రభావాన్ని కలిగి ఉండే అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. అరటిపండులో ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి అరటి అన్ని వయసుల వారు తినొచ్చు.
అయితే ప్రస్తుతం చాలా మంది యువత.. బరువు పెరుగుతుందనే భయంతో చాలా మంది అరటిపండ్లును తినరు. కానీ అరటిపండ్లు బరువు తగ్గడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అరటిపండ్లు తింటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది మిమ్మల్ని తక్కువ తినేలా చేస్తుంది. కానీ అతిగా తినడం వల్ల బరువు పెరుగుతారు. హెల్త్‌లైన్ ప్రకారం, అరటిపండ్లు పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ B6 యొక్క మంచి మూలం. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రోజూ అరటిపండ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని 2014 ఓ అధ్యయనంలో తేలింది.
అరటిపండు ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలకు మంచి మూలం. మధ్య తరహా అరటిపండులో దాదాపు 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అరటిపండ్లలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి మరియు ఖాళీ కడుపుతో దీనిని తినకూడదంట. కానీ రోజంతా అరటిపండు తినకూడదు. కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడంలో అరటిపండు కూడా సహాయపడుతుంది. కరిగే ఫైబర్ పుష్కలంగా ఉండే అరటిపండ్లను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిని చాలా వరకు తగ్గిస్తుంది. అంతే కాకుండా అరటిపండు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. రక్తపోటును నియంత్రించడానికి అరటిపండ్లు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ప్రతిరోజూ రెండు అరటిపండ్లను తినొచ్చని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు వ్యాయామం చేసేవారు మూడు అరటిపండ్లు తినవచ్చు. కానీ మధుమేహం ఉన్నవారు అరటిపండ్లను తినకూడదు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)