Tuesday, September 17, 2024
Homeహెల్త్Avocado: అవకాడో చాలా మంచిదిగురూ

Avocado: అవకాడో చాలా మంచిదిగురూ

ఆరోగ్యానికి మంచిది కాబట్టే సూపర్ ఫుడ్ అంటారు

అవకెడోతో ఆరోగ్యం పదిలం…

- Advertisement -

అవకెడో సూప్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే పోషకాహార నిపుణులు ఈ సూప్ ని తప్పకుండా తీసుకోవాలంటారు. ఇదెంతో రుచిగా కూడా ఉంటుంది. అవకెడో పండుతోనే ఈ సూప్ చేస్తారు. పండులోని పోషకాహార స్వభావం వల్ల ఇది ఆరోగ్యానికి చేసే మేలెంతో. అవకెడోలో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే విటమిన్ కె, ఇ, బి వంటి వాటితో పాటు ఖనిజాలు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ శరీరారోగ్యాన్ని ఎంతగానో పరిరక్షిస్తాయి. ఈ పండులో మోనోఅన్ శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉన్నాయి.

ముఖ్యంగా ఓలిక్ యాసిడ్ అధికంగా ఉంది. ఇవన్నీ హెల్దీ ఫ్యాట్స్. ఇవి గుండెజబ్బుల రిస్కును తగ్గిస్తాయి. అవకెడోలోని కెరటొనాయిడ్స్ ల్యూటిన్, జెక్సాన్థిన్ లు కూడా కంటి ఆరోగ్యాన్ని బాగా సంరక్షిస్తాయి. కాటరాక్ట్ రిస్కును తగ్గిస్తాయి. అవకెడోలో ఫైబర్ బాగా ఉంది. ఇందులో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా బాగా ఉన్నాయి. ఇవి కడుపునిండుగా ఉన్నట్టు ఉంచడమే కాదు ఆకలి కూడా అనిపించదు.

క్రేవింగ్స్ ఉండవు. ఇది వెయిట్ మేనేజ్మెంట్ కు ఎంతో ఉపయోగపడుతుంది. అవకెడోలోని హెల్దీ ఫ్యాట్స్, యాంటాక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు ఎంతో మెరిపిస్తాయి. చర్మానికి కాలసిన తేమను అందించడమే కాకుండా యువి రేడియేషన్ ప్రభావం పడకుండా రక్షణ కల్పిస్తుంది. ఈ పండులో ఉన్న ఆరోగ్యకరమైన అన్శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, పీచుపదార్థాలు బ్లడ్ షుగర్ ప్రమాణాలను కూడా బాగా నియంత్రిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News