Ginger Side Effects: అందరి వంటింట్లో కామన్ గా ఉండే ఆహార పదార్థాలలో అల్లం ఒకటి.అల్లం లేనిదీ ఏ వంటకం తయారు చేయలేం. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అల్లాన్ని.. అల్లం టీ, సూప్, కూరగాయల ద్వారా ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అల్లం అందిస్తుంది. అందుకే దీనిని ‘సహజ ఔషధం’గా పరిగణిస్తారు. అయితే, ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు దీనిని తీసుకుంటే ఆరోగ్యానికి మరింత హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
1. ఇప్పటికే అధిక బిపి సమస్యతో బాధపడుతున్నవారు అల్లాన్ని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే కొన్ని అంశాలు రక్తాన్ని పలుచబరచడంలో సహాయపడుతాయి. దీంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అయితే రక్తపోటు తక్కువగా ఉన్నవారు, అల్లం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ తీసుకుంటే మరింత ప్రమాదకరం కావచ్చు. ఇటువంటి వ్యక్తులు వైద్యుడి సలహా మేరకు అల్లం ఆహారంలో భాగం చేసుకోవాలి.
Also Read: Hair Care: కొబ్బరి నూనెలో ఈ నాలుగు కలిపి రాస్తే.. పొడవాటి జుట్టు మీ సొంతం..!
2. రక్తాన్ని పలుచబరిచే మందులు తీసుకునేవారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అల్లం ఆహారంలో భాగం చేసుకోవడం మానేయాలి. దీనికి కారణం అల్లంలో ఉండే కొన్ని అంశాలు రక్తాన్ని మరింత పలుచగా చేస్తాయి. ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. కావున డాక్టర్ సలహా తీసుకొని అల్లాన్ని తీసుకోవాలి.
3. గర్భధారణ ప్రారంభ సమయంలో మహిళలకు వికారం, వాంతుల వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, దీని క్రమంగా అధికంగా తీసుకుంటే, గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో గర్భధారణ మహిళలు వైద్య సలహా తర్వాత మాత్రమే అల్లం తీసుకోవాలి.
4. అల్లాన్ని ఆహారంలో చేర్చుకుంటే కడుపును వేడి చేస్తుంది.అంతేకాదు ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. కానీ, ఆమ్లత్వం లేదా పుండు సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో ప్రమాదకరం. పైగా ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కడుపులో ఎక్కువ మంట, నొప్పికి కారణమవుతుంది.
5. బరువు తగ్గాలనుకునేవారికి అల్లం ఎంతో ఉపయోగకరం. ఇది శరీర జీవక్రియను పెంచుతుంది. అంతేకాదు పేరుకుపోయిన కొవ్వును సైతం కరిగించడంలో సహాయపడుతుంది. అయితే, ఇప్పటికే తక్కువ బరువు సమస్యతో ఉంటె, అల్లం తీసుకుంటే ఇది బరువును మరింత తగ్గించే అవకాశం ఉంటుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


