Avoid these fruits in Rainy Season: వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలంలో వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే, ఈ సీజన్ లో అనేక వ్యాధులు సంభవిస్తాయి. తేమ, ధూళి కారణంగా బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాపిస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఈ సమయంలో తీసుకునే ఆహార విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం ముఖ్యం. అయితే పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కానీ, వర్షాకాలంలో కొన్ని పండ్లను ఆహారంలో చేర్చుకోకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే వాటిని తినడం వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా ఎక్కువ హాని కలిగిస్తాయి. ఎక్కువగా నీరు శాతం ఉన్న పండ్లు వర్షాకాలంలో త్వరగా చెడిపోతాయి. బ్యాక్టీరియా లేదా కీటకాలు వాటిపై దాడి చేస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాటిని తినడం వల్ల కడుపునొప్పి, ఫుట్ పాయిజన్, వాంతులు-విరేచనాలు జలుబు వంటి సమస్యలు వస్తాయి. అయితే, ఇప్పుడు వర్షాకాలంలో ఎలాంటి పండ్లను తినకూడదో తెలుసుకుందాం.
బెర్రీస్
వర్షాకాలంలో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ పండ్లు తేమ కారణంగా త్వరగా చెడిపోతాయి. దీని ద్వారా బాక్టీరియా త్వరగా దానికి వ్యాపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో వాటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే ఫుట్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది.
పుచ్చకాయ
అధిక ఎండల కారణంగా అందరూ వేసవిలో పుచ్చకాయ పండ్లను ఎక్కువగా తింటుంటారు. కానీ, వర్షాకాలంలో వాటిని తినడం పూర్తిగా మానుకోవాలి. ఎందుకంటే ఈ పండ్లు సులభంగా చాలా తేమను గ్రహిస్తాయి. దీని కారణంగా అవి త్వరగా చెడిపోతాయి.ఒకవేళ తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Zero Calories Foods: జీరో క్యాలరీలు ఉండే ఆహారాలు ఇవే.. తింటే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!
మామిడి పండు
వేసవిలో లభించే మామిడి పండును వర్షకాలంలో తినడం మానుకోవాలి. ఈ పండు కడుపు చికాకు, ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది. ఈ కాలంలో ఈ పండును తింటే కడుపులో బరువు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా పెరుగుతాయి.
పీచ్
పీచ్ అనేది తేమ కారణంగా త్వరగా మృదువుగా మారే పండు. దీంతో ఈ పండులో ఫంగస్ సులభంగా పెరుగుతుంది. ఒకవేళ ఈ పండును తింటే కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
జాగ్రతలు
1. వర్షాకాలంలో ఇతర పండ్లను కూడా తక్కువ తినాలి. ఎందుకంటే వర్షపు నీటిలో తడిసిన పండ్లు క్రిములు, బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చు. ఇవి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.
2. పండ్లు తినే ముందు శుభ్రంగా కడగాలి. తగిన మొత్తంలో మాత్రమే తీసుకోవడం ముఖ్యం.
3. ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, ఏదైనా పండు తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.