Saturday, September 21, 2024
Homeహెల్త్Baby brain growth: బేబీ బ్రెయిన్ ఆరోగ్యంగా పెరగాలంటే అమ్మలు ఇవి తినాలి

Baby brain growth: బేబీ బ్రెయిన్ ఆరోగ్యంగా పెరగాలంటే అమ్మలు ఇవి తినాలి

మూడు వారాల తరువాత బేబీ మెదడు ఆరోగ్యంగా పెరిగేందుకు తల్లులు ఇవన్నీ తినాల్సిందే

చిన్నారి మెదడు ఆరోగ్యంగా పెరిగేలా చేసే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. ఇవి పుట్టిన బేబీని యాక్టివ్ గా ఉంచడమే కాదు స్మార్ట్ బేబీగా కూడా ఆ చిన్నారిని మలుస్తాయి. బేబీ మెదడు పెరుగుదల సాధారణంగా గర్భధారణ తర్వాత మూడు వారాలకు మొదలవుతుంది. అప్పుడే పిండం బ్రెయిన్ పెరుగుదల మొదలవుతుంది. అందుకే బేబీ మెదడు ఆరోగ్యంగా పెరిగేందుకు తల్లులు సరిగ్గా ఈ టైము నుంచే పోషకాహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. కడుపులోని పిండం యొక్క బ్రెయిన్ లో 24 వారాల నుంచి 42 వారాల మధ్యలో ఎంతో వేగంగా మార్పులు సంభవిస్తాయి. ముఖ్యమైన మార్పులు మాత్రం 34 వారాల తర్వాత నుంచి మొదలవుతాయి. అందుకే ఈ టైములో తీసుకునే ఆహారం విషయంలో అమ్మలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడే బేబీ బ్రెయిన్ హెల్దీగా పెరుగుతుంది.

- Advertisement -

అందుకు గర్భిణీలు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి శార్డైన్స్. ఈ చేపల్లో డిహెచ్ఎ అనే ఎసెన్షియల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. శార్డైన్స్, కొన్ని రకాల ఆయిలీ ఫిష్ లు తినడం వల్ల బేబీ బ్రెయిన్, కేంద్ర నాడీ వ్యవస్థ బాగా వృద్ధి అవుతుంది. అంతేకాదు డిహెచ్ఎ అనేది బేబీ రోగనిరోధక వ్యవస్థ పెంచడంతో పాటు కన్నులు ఏర్పడడంలో సైతం ఎంతో తోడ్పడుతుంది. అందుకే వీటిని తింటే బేబీ పెరుగుదల బలంగా ఉంటుంది. శార్టైన్స్ లో విటమిన్ డి కూడా బాగా ఉంది. గర్భిణీలు తీసుకోవాల్సిన మరో ముఖ్య ఆహారపదార్థం గుమ్మడి గింజలు. ఈ టైములో అమ్మలు వీటిని తినడం ఎంతో మంచిది. ఈ గింజల్లో జింకు పుష్కలంగా ఉంటుంది. బ్రెయిన్ నిర్మాణంలో జింకుది చాలా ముఖ్య పాత్ర. బ్రెయిన్ లో సమాచారాన్ని స్వీకరించి అందజేసే భాగాన్ని జింకు బాగా ఉత్తేజితం చేస్తుంది. అందుకే గర్భిణీలు రోజుకు ఏడు మిల్లీగ్రాముల గుమ్మడి గింజలు తింటే మంచిదంటున్నారు పోషకాహారనిపుణులు. గర్భిణీలు తప్పనిసరిగా తినాల్సిన మరో వస్తువు పాలకూర. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఫోలేట్ కూడా ఇందులో సహజసిద్ధంగా ఉంటుంది. ఇది న్యూ డిఎన్ఎ జనరేట్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

కణాల జీవక్రియను సైతం క్రమబద్ధీకరిస్తుంది. పాలకూరలోని యాంటాక్సిడెంట్లు బేబీ బ్రెయిన్ లోని టిష్యూలు దెబ్బతినకుండా కాపాడుతాయి. అందుకే నిత్యం 400 ఎంసిజి ఫొలేట్ తీసుకోవాలి. పాలకూర తినడంలో నిర్లక్ష్యం చేస్తే అవసరమైన పోషకాలను తల్లులు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. బ్రెయిన్ కు ప్రోటీన్, ఐరన్ ఎంత అవసరమో గుడ్లు కూడా అంతే అవసరం. వీటిల్లో కొలైన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జ్ఘాపకశక్తిని వృద్ధిచేస్తుంది. అందుకే దీన్ని నిత్యం 450 మిల్లీగ్రాముల మేర శరీరానికి అందించాలి. గుడ్లలోని సొనల్లో కొలైన్ బాగా ఉంటుంది. అలాగే బేబీ బ్రెయిన్ కేంద్ర నాడీ వ్యవస్థను పెంపొందించడంలో బీటా కొరటెనె చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. అందుకే గర్భిణీలు దాన్ని నిత్యం 700 ఎంసిజి మేర తీసుకోవాల్సి ఉంటుంది. ఆరంజ్ గుజ్జు ఉన్న చిలకడ దుంపల్లో బెటా కెరొటెనె బాగా ఉంటుంది. బ్రెయిన్ లో రసాయనాలు ఉత్పత్తితో పాటు మిలిన్ ఏర్పడాలంటే ఐరన్ చాలా అవసరం.

సంక్షిప్తంగా, వేగంగా సమాచారాన్ని బ్రెయిన్ చేరవేయడానికి మిలిన్ అత్యావశ్యకం. ఐరన్ లోపం ఉంటే
మానసిక లోపంతో బేబీ పుడుతుంది. అంతేకాదు బేబీకి ఆక్సిజన్ అందాలన్నా కూడా ఐరన్ అత్యావశ్యకం. సాధారణంగా గర్భధారణ సమయంలో చాలామంది స్త్రీలు ఐరన్ లోపాన్ని ఎదుర్కొంటారు. అందుకే వాళ్లు తప్పనిసరిగా ఐరన్ బాగా తీసుకోవాలి. గర్భధారణ సమయంలో నిత్యం కనీసం 14.8 మిల్లీగ్రాముల ఐరన్ తీసుకోవాల్సి ఉంటుంది. పప్పు, విటమిన్ సిల మిశ్రమం శరీరంలో ఐరన్ ప్రమాణాలను బాగా పెంచుతుంది. పప్పు పులుసులో టొమాటోలు కూడా వేసుకుని తింటే కూడా ఎంతో మంచిది. బీట్ రూట్, దానిమ్మ, చికెన్, చిక్కుళ్లు వంటి వాటిల్లో ఐరన్ బాగా ఉంటుంది. బ్రెజిల్ నట్స్ కూడా గర్భిణీలకు చాలా మంచిది. వీటిల్లో మోనోఅన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ బాగా ఉంటాయి. అంతేకాదు వాటిల్లో సెలెనియమ్ కూడా పుష్కలంగా ఉంది. సెలీనియం లోపం వల్ల బేబీలో బ్రెయిన్ ఇంపైర్మెంట్ తలెత్తే అవకాశం ఉంది. కనుక
తప్పనిసరిగా వీటిని నిత్యం తినాలి.

నిత్యం గర్భిణీ స్త్రీ 60 ఎంసిజి పరిమాణలో సెలినియమ్ ని తీసుకోవాలి. అంటే ఒక్క బ్రెజిల్ నట్ ను తింటే చాలు. మోనో అన్ శాచ్చురేటెడ్ ఫ్యాట్స్ బాగా ఉన్న మరో పదార్థం పల్లీలు. పల్లీల్లో నియాసిన్, ఫొలేట్, ప్రొటీన్లు బాగా ఉన్నాయి విటమిన్ ఇ కూడా పల్లీల్లో పుష్కలంగా ఉంది. వీటిల్లోని విటమిన్ ఇ డిఎచ్ ఎకి అండగా ఉండడమే కాకుండా బ్రెయిన్ సెల్ మెంబ్రన్స్ ను రక్షిస్తుంది కూడా. చర్మ ఆరోగ్యపరంగా కూడా పల్లీలు గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి .నిత్యం విటమిన్ ఇ ని మూడు మిల్లీగ్రాముల తీసుకోవాలి. గర్భిణీలకు తప్పనిసరిగా అవసరమయ్యే మరొకటి అయొడిన్. దీన్ని గర్భిణులు తప్పనిసరిగా తీసుకోవాలి. దీన్ని తీసుకోవడం వల్ల బేబీ మానసిక సమస్యల బారిన పడకుండా నిరోధించవచ్చు. అన్నిరకాల పెరుగుల్లో అయొడిన్ బాగా ఉంటుంది. గ్రీక్ యొగర్ట్ విషయానికి వస్తే అందులో ఎక్కువ పరిమాణంలో ప్రొటీన్లు ఉంటాయి. ఇవి బేబీ తక్కువ బరువుతో పుట్టకుండా సంరక్షిస్తాయి. గర్భిణీలలో 140 ఎసిజి అయొడిన్ ప్రమాణాలు ఉండాలి. పెరుగు మాత్రమే కాకుండా పాలు,
పియర్స్, ఐయొడైజ్డ్ ఉప్పులో సైతం అయొడిన్ బాగా ఉంటుంది. అరవై శాతం ఫ్యాట్స్ తోనే బ్రెయిన్
పెంపొందుతుంది. బ్రెయిన్ కు అవకెడో చాలా మంచిది.

ముఖ్యంగా వీటిల్లో అధిక ప్రమాణాల్లో ఓలిక్ యసిడ్ ఉంది. ఇది మిలిన్ రూపొందించడంలో సహాయం చేస్తుంది. కేంద్ర నాడీవ్యవస్థ లోని నరాలను ఇది సరక్షిస్తుంది. నిత్యం మనకు 25 నుంచి 35 శాతం కాలరీలు ఫ్యాట్స్ నుంచే వస్తాయి. వీటిల్లో చాలావరకూ మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్సే ఉంటాయి.
సో …గర్భిణీలు ఎంతో ఆరోగ్యకరమైన ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే బేబీ బ్రెయిన్ ఆరోగ్యవంతంగా పెరగడమే కాదు పుట్టే బేబీ కూడా సూపర్ స్మార్ట్ గా ఉంటుంది….

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News