పెళ్లి అయినా పండుగ అయినా ఏ కార్యమైనా అరటి పండు(Banana) ఉండాల్సిందే. ఎందుకంటే ఈ అరటికి ఉండే విశిష్టత అంత ఉంది. మరి ముఖ్యంగా మన హిందూ సంప్రదాయ ప్రకారం అరటి పండుకు చాలా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కానీ వీటిని తింటే కూడా అంతే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ పండును అందరూ తింటారు. కానీ తొక్కను మాత్రం పడేస్తుంటారు. కానీ తొక్కలో కూడా అంతే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.
అరటి సాగు ఏడాది పొడవునా లభించే పంట. ఈ అరటి పండును అందరు ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకంటే అరటి పండులో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉన్నాయి. దీంతో అరటిపండును తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
ఇవే ఆరోగ్యం ప్రయోజనాలు
సాధారణంగా మనం అరటి పండును తినేసి తొక్కను పారేస్తూ ఉంటాం. కానీ అరటిపండు తొక్క వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అరటి తొక్కలో ఉండే విటమిన్ B6 ఇంకా ట్రి ప్టోఫాన్ డిప్రెషన్ ను తగ్గిస్తుందని చెబుతున్నారు.
కొవ్వును తగ్గిస్తుంది
మనం తినే అరటి తొక్కలో మెండుగా ఉండే ఫైబర్ కొలస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని చెబుతారు. గుండెకు సంబంధించిన రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుందని చెబుతున్నారు. దాంతో గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు.
అరటి తొక్కతో కంటికి మేలు
ఈ బనాన తిన్న తర్వాత తొక్కను కంటిపై పెట్టుకోవడం వల్ల కంటి చుట్టూ ఉండే నల్లటి మచ్చలు తగ్గుతాయని అంటున్నారు. కంటిపై చల్లదనం ఉంటుంది. కంటికి కాస్తా ఉపశమనం కలుగుతుంది. కంటికి సంబంధించిన ఎన్నో సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని అంటున్నారు వైద్యులు.
మలమద్దకం సమస్యకు చెక్
అరటి పండును తరుచు తీసుకోవటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు మెండుగా ఇందులో పోషకాలుంటాయన్నారు. అరటి తొక్కను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుందని చెబుతున్నారు.
గార పళ్లు నుంచి ఉపశమనం
ఒక వారం రోజులపాటు అరటి తొక్కను నోటి పళ్ళపై ఒక నిమిషం పాటు రుద్దడం వల్ల పంటిపై ఉండే గార తొలగిపోయి దంతాలు మిలమిలగా మెరుస్తాయట. తొక్కలో ఉంటే పొటాషియం, మెగ్నీషియం పంటి పై నున్న ఎనామిల్ తీసుకొని అలా మెరవడానికి కారణమవుతాయట.
ముఖంపై మెటిమలు మాయం
అరటి తొక్కను ముఖంపై ఒక వారం పాటు రాస్తే మొటిమలు కూడా మాయం అవుతాయని చెబుతున్నారు. చర్మంపై మంట, దురదలు, మచ్చలు ఏవైనా ఉన్నా కూడా పోతాయని చెబుతున్నారు.
ముఖంపై ముడతలు
ముడతలు రాకుండా అరటి తొక్క ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.