How to eat fruits in diabetes Telugu: ఫ్రూట్స్ అనేవి శరీరానికి అవసరమైన న్యాచురల్ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అందించే ముఖ్యమైన ఆహారం. రోజూ ఫ్రూట్స్ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది, ఇమ్యూనిటీ బలపడుతుంది, స్కిన్ హెల్త్ కూడా బెటర్ అవుతుంది. కానీ చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే “ఫ్రూట్ కాబట్టి ఎంత తిన్నా ఓకే” అనుకోవడం. నిజానికి ప్రతి ఫ్రూట్ రక్తంలో చక్కెరపై ఒకేలా ప్రభావం చూపదు. కొన్ని ఫ్రూట్స్ షుగర్‌ను నెమ్మదిగా పెంచుతాయి, కొన్ని మాత్రం ఫాస్ట్‌గా పెంచేస్తాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవాళ్లు ఫ్రూట్ సెలెక్షన్ విషయంలో కచ్చితంగా జాగ్రత్త పడాలి.
బానానా బెస్ట్ ఆప్షన్ అంటారా?
బనానా తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. కారణం ఇందులో ఉండే న్యాచురల్ షుగర్స్. ఒక మీడియం సైజ్ బనానాలో సుమారు 2 7 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పచ్చగా ఉన్న బనానాలో రెసిస్టెంట్ స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ నెమ్మదిగా రక్తంలోకి వెళ్తుంది. కానీ పూర్తిగా పండిన బనానాలో షుగర్ శాతం పెరుగుతుంది, అప్పుడు బ్లడ్ షుగర్ త్వరగా స్పైక్ అవుతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు బనానాను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ చిన్న బనానా మాత్రమే తీసుకోవాలి, ఖాళీ కడుపుతో కాకుండా భోజనం తర్వాత లేదా వాకింగ్ చేసిన తర్వాత తీసుకుంటే మంచిది. రోజూ కాకుండా వారానికి 2 లేదా 3 సార్లు సరిపోతుంది.
Read Also: RBI India: నకిలీ నోట్లకు కళ్లెం.. రూ. 100, రూ. 500 నోట్లలో ఆర్‌బీఐ చేసిన కొత్త మార్పులు
ఆపిల్ మంచిదా?
ఆపిల్ మాత్రం బ్లడ్ షుగర్ కంట్రోల్‌కు బాగా ఉపయోగపడే ఫ్రూట్. ఒక మీడియం ఆపిల్‌లో సుమారు 2 5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నా, ఇందులో ఫైబర్ దాదాపు 4 గ్రాములు ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల షుగర్ రక్తంలోకి చాలా నెమ్మదిగా వెళ్తుంది. అందుకే ఆపిల్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ స్పైక్ తక్కువగా ఉంటుంది. రోజుకు 1 మీడియం ఆపిల్ డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా సేఫ్‌గా తీసుకోవచ్చు. తొక్కతో పాటు నమిలి తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. జ్యూస్ చేసుకుని తాగడం కంటే పూర్తిగా తినడమే బెస్ట్.
ఆపిల్ – బనానాకి తేడా ఇదే..
ఆపిల్ ఎక్కువ సేపు పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి వెయిట్ తగ్గించుకోవాలనుకునేవాళ్లకూ ఇది మంచి ఎంపిక. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరం ఇన్సులిన్‌ను బెటర్‌గా ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి. బనానా ఎనర్జీకి బాగుంటుంది కానీ షుగర్ త్వరగా పెరిగే స్వభావం ఉంటుంది. ఆపిల్ మాత్రం నెమ్మదిగా ఎనర్జీ ఇస్తుంది, షుగర్ స్టేబుల్‌గా ఉండేలా చేస్తుంది. రక్తంలో చక్కెర కంట్రోల్ విషయంలో ఆపిల్ స్పష్టంగా ముందుంటుంది. డైలీ ఫ్రూట్‌గా ఆపిల్ తీసుకోవచ్చు. బనానాను మాత్రం అప్పుడప్పుడు చిన్న పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అసలు కీలకమైన విషయం పోర్షన్ కంట్రోల్, టైమింగ్. ఇలా చేస్తే బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది, హెల్త్ కూడా బెటర్‌గా ఉంటుంది.

