Friday, September 20, 2024
Homeహెల్త్Bath powder: నలుగు పెట్టుకోండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వండి

Bath powder: నలుగు పెట్టుకోండి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వండి

తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన అందం సొంతం చేసుకునే..

నలుగు ఇలా పెట్టుకుంటే చర్మం మెరుస్తుంది…

- Advertisement -

చర్మం మెరయడానికి ఎక్స్ ఫొయిలేషన్ ఎంతగానో పనికివస్తుంది. దీనివల్ల చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. అయితే చర్మాన్ని ఎక్స్ ఫొయిలేషన్ చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలని చర్మనిపుణులు అంటున్నారు. స్కిన్ కేర్ ప్రక్రియలో ఇది ఎంతో ముఖ్యమైనదని కూడా వీరు చెప్తున్నారు. సరైన పద్ధతిలో చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేసుకోకపోతే దానివల్ల విపరీత పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని కూడా వాళ్లు చెప్తున్నారు. ఈ పనిని ఎంతో శ్రద్ధగా, ఏకాగ్రతతో చేసుకోవాలని సూచిస్తున్నారు. అందుకే ఈ పని చేసేటప్పుడు చేయకూడని పనులు, పాటించవలసిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయని చర్మ నిపుణులు చెప్తున్నారు. ఈ ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియను సరిగా అర్థంచేసుకుంటే
మంచి ఫలితాలను పొందగలరని కూడా అంటున్నారు. ఎక్స్ ఫొయలేషన్ అంటే నలుగులాంటి క్రియ. దీనివల్ల చర్మం పైభాగంపై చేరిన మ్రుతకణాలు పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. దీన్ని చేసుకోవడం వల్ల చర్మ రంధ్రాలు విశాలంగా అయి గాలి బాగా తగులుతుంది. కొత్త కణాలు వ్రుద్ధిచెందుతాయి. స్కిన్ టెక్స్చెర్ మెరుగుపడుతుంది.

తరచూ ఎక్స్ ఫొయిలేషన్ చేసుకోవడం వల్ల స్కిన్ అబ్సార్ఫ్షన్ బాగా పెరుగుతుంది. నిత్యం ఎక్స్ ఫొయిలేషన్ చేసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. ఎంతో మ్రదువుగా తయారవుతుంది. చర్మం మెరుస్తుంది. చర్మాన్ని ఎక్స్ ఫొయిలేషన్ చేసుకునేటప్పుడు కొన్ని పొరబాట్లు చేస్తుంటాం. అవి చేయకుండా చర్మాన్ని సరిగ్గా ఎక్స్ ఫోయిలేషన్ చేసుకోవాలంటే మీ చర్మ స్వభావాన్ని బట్టి సరైన ఎక్స్ ఫొయలెంట్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. చర్మం స్వభావాన్ని బట్టి ఎక్స్ ఫొయిలెంట్స్ ప్రక్రియ కూడా మారుతుంటుంది. మీకు సున్నితమైన లేదా పొడి చర్మం ఉన్నట్టయితే మైల్డ్ ఎక్స్ ఫొయిలెంట్స్ ను ఎంపికచేసుకోవాలి. అంటే పోలీహైడ్రాక్సీ యాసిడ్స్ (ఎహెచ్ఎ) లేదా పిహెచ్ ఎల ను వాడాలి. జిడ్డు చర్మం లేదా యాక్నే సమస్య ఉన్న చర్మ స్వభావం కలవారు బిహెచ్ ఎ ను అంటే గ్లైకోలిక్ యాసిడ్ వంటి శక్తివంతమైన ఎక్స్ ఫొయిలెంట్ ను వాడాలి. మీచర్మ స్వభావాన్ని బట్టి వీటిని వాడడం వల్ల చర్మం దెబ్బతినదు. ఎలాంటి ఇరిటేషన్ కు గురవదు.

కొత్త ఎక్స్ ఫొయిలెంట్ ఉత్పత్తులు వాడేటప్పుడు తప్పనిసరిగా ప్యాచ్ టెస్టు చేసుకోవాలి. చేతిపై ఆ ఉత్పత్తిని కొద్దిగా పూసుకుని ఏదైనా ఇరిటేషన్ కలిగిస్తుందేమో పరిక్షించాలి. కొత్త ఎక్స్ ఫొయిలెంట్ ను అప్లై చేసిన ప్రదేశంలో ఎర్రగా అవడం, దురదగా అనిపించడం, ఇరిటేషన్ గా ఉంటే ఆ ప్రాడక్టును వాడొద్దు. 24 గంటల్లో చర్మంపై ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తకపోతే ఆ ప్రాడక్టు సురక్షితం అని భావించవచ్చు. మరో ముఖ్య అంశం ఏమిటంటే తరచూ చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేసుకోవాలి. కనీసం వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఈ ప్రక్రియ చేయాలి. ఇలా తరచూ చర్మాన్ని ఎక్స్ ఫొయిలేషన్ చేయడం వల్ల చర్మం శుభ్రంగా ఉండడంతో పాటు ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. చర్మం టెక్స్చెర్ దెబ్బతినదు. ఇరిటేషన్ వంటివి తలెత్తవు.
అలాగే ఎక్స్ ఫొయిలేషన్ చేసుకునేటప్పుడు మీ చర్మం ఎలా స్పందిస్తోందన్న విషయాన్ని గమనించుకోవాలి. మీ చర్మం మీకు ఏమి చెబుతోందన్నది గ్రహించాలి. ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియకు మీ చర్మం ఎలా స్పందిస్తోందో గమనించుకోవాలి. ఎక్స్ ఫొయిలేట్ చేసేటప్పుడు చర్మం బాగా కందినట్టు అయినా, పొడిబారినట్టు అయినా, ఇరిటేషన్ అనిపించినా ఎక్స్ ఫొయిలేషన్ ను ఎక్కువగా చేయడం గాని, బలంగా చేయడం గాని మంచిది కాదు. చర్మం ఎలా స్పందిస్తుందన్న దాన్ని బట్టి ఎక్స్ ఫొయలేషన్ ప్రక్రియను మీరు కొనసాగించాలని మరవొద్దు. అలాగే ఎక్స్ ఫొయిలేషన్ చేసుకునేటప్పుడు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేసుకుంటే చర్మం కాంతివంతం అవుతుందన్న ఉద్దేశంతో కొందరు విపరీతంగా ఈ ప్రక్రియను అనుసరిస్తుంటారు. అలా అతిగా చేయడం వల్ల చర్మం ఇరిటేషన్ కు గురవుతుంది. చర్మం సున్నితత్వం దెబ్బతింటుంది. అందుకే ఎక్కువసార్లు ఎక్స్ ఫొయిలేషన్ చేయకుండా మోడరేట్ మార్గాన్ని అనుసరించమంటున్నారు చర్మ నిపుణులు.

విపరీతంగా చర్మాన్ని స్ర్కబ్బింగ్ చేయడం కూడా మంచిది కాదంటున్నారు. అతిగా ఎక్స్ ఫొయిలేటింగ్ ఉత్పత్తులకు చర్మం ప్రభావితమైనా కూడా చర్మం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్స్ ఫొయిలేషన్ చేసుకునేటప్పుడు శరీరంపై గట్టి బ్రష్ లను గాని, స్క్రబ్బులను గాని వాడొద్దు. వీటివల్ల చర్మం సూక్ష్మస్థాయిలో చిట్లే అవకాశం ఉంది. దీంతో చర్మం తీవ్ర సమస్యలకు లోనవుతుంది. అందుకే చర్మానికి హాని చేయని, మ్రదువైన ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియను అనుసరించడం మంచిది. అందుకే సున్నితమైన ఎక్స్ ఫొయిలెంట్స్ ను వాడడం మంచిదని చర్మ నిపుణులు సూచిస్తున్నారు. ఇరిటేషన్ ఉన్న చర్మంపై, అలాగే దెబ్బతిన్న చర్మంపై ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియ చేపట్టకూడదు. అలాగనుక చేస్తే చర్మం తీవ్రంగా దెబ్బతినడమే కాదు అందువల్ల ఏర్పడిన బాధ, నొప్పులు తొందరగా తగ్గవు కూడా. మీకు సన్ బర్న్స్ , కట్స్, దద్దుర్లు, యాక్నే ఉంటే అవి తగ్గేవరకూ ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియకు దూరంగా ఉండాలి. కొందరు రకరకాల ఎక్స్ ఫొయిలెంట్ ప్రొడక్టులను కలిపి ఒకేసారి చర్మంపై అప్లై చేస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఇది చర్మాన్ని దెబ్బతీస్తుంది. దీంతో చర్మం బాగా సున్నితంగా తయారవుతుంది. అందుకే ఒక ఎక్స్ ఫొయిలెంట్ ప్రొడక్టును మాత్రమే చర్మానికి రాసుకోవాలి. ఎక్స్ ఫొయిలేషన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందంతో మెరిసేలా చేస్తుంది. పైన చెప్పిన అంశాలన్నీ గమనించుకుని తదనుగుణంగా ఎక్స్ ఫొయిలేషన్ ప్రక్రియను పాటిస్తే మీ చర్మం అందంగానే కాదు ఎంతో సురక్షితంగా కూడా ఉంటుంది.

మీ చర్మ స్వభావాన్ని బట్టి, అవసరాలను గమనించుకుంటూ తదనుగుణంగా ఎక్స్ ఫొయిలంట్స్ ను ఉపయోగించడం మరవకండి. అంతేకాదు చర్మానికి మాయిశ్చరైజర్ బాగా అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యరశ్మి బారిన చర్మం పడకుండా తగిన రక్షణ తీసుకోవాలి. సరిగా ఎక్స్ ఫొయలేట్ చేసుకుంటే మీ చర్మం మ్రుదువుగా, ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. అప్పుడు అందరి చూపులూ మీపైనే. ఈ స్కిన్ కేర్ రొటీన్ పాటించేటప్పుడు చర్మ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మరవొద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News