Sunday, October 6, 2024
Homeహెల్త్Beans the best: స్కిన్ కోసం బీన్స్

Beans the best: స్కిన్ కోసం బీన్స్

ఏ జాతి బీన్స్ అయినా ఆరోగ్యానికి మంచిది

చర్మాన్ని మెరిపించే బీన్స్…

- Advertisement -

మన ఆహారంలో రకరకాల బీన్స్ ను వాడుతుంటాం. ఈ బీన్స్ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్. ముఖ్యంగా చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మనం వాడే రకరకాల బీన్స్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బీన్స్ చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. కాస్మొటిక్స్, జీవనశైలి మాత్రమే కాదు మనం తీసుకునే డైట్ సైతం శరీరాన్ని,చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తుందనడానికి బీన్స్ చక్కటి ఉదాహరణ.

కిడ్నీ బీన్స్ నుంచి చెన్నా, సోయాబీన్స్, బ్లాక్ బీన్స్, ఇంకా రకరకాల చిక్కుళ్లు ఇవన్నీ పోషకాల నిధులు. ముఖ్యంగా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బీన్స్ నిర్వహించే పాత్ర చాలా కీలకమైంది. బీన్స్ పోషకాలతో నిండి ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్ అయిన ప్రొటీన్ వీటిల్లో పుష్కలం. ఇది శరీరానికే కాదు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. శరీరాక్రుతితో పాటు మొత్తం ఆరోగ్యానికి సైతం బీన్స్ చేసే మేలు ఎంతో. బీన్స్ లో ప్లాంట్ ఆధారిత ప్రొటీన్ ఉంటుంది. వీటిని నిత్యం తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఫ్రీరాడికల్స్ చేసే హాని నుంచి సైతం ఇవి రక్షిస్తాయి.

అంతేకాదు బీన్స్ లో యాంటి ఏజింగ్ గుణాలు కూడా బాగా ఉన్నాయి. సుదీర్ఘకాలం యంగ్ గా, మెరిసే చర్మంతో ఉండాలంటే తప్పనిసరిగా బీన్స్ తినాలని న్యూట్రిషనిస్టులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా బీన్స్ లో స్కిన్ అనుకూల న్యూట్రియంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. వీటిల్లోని జింకు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. చర్మం కాంతివిహీనంగా లేకుండా మెరిసేలా చేస్తుంది. సూర్యరశ్మి కారణంగా చర్మం దెబ్బతినకుండా పరిరక్షిస్తుంది. కిడ్నీ బీన్స్, సోయాబీన్స్ లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేయడమే కాదు మరింత అందంగా, పట్టులా మ్రుదువుగా చేస్తాయి. స్కిన్ కేర్ కోసం బీన్స్ ను రకరకాలుగా వండుకోవచ్చు. వీటిని సలాడ్లలో వాడొచ్చు. అంతేకాదు మనదేశంలో పలురకాల సంప్రదాయ వంటకాల్లో కూడా బీన్స్ ను బాగా ఉపయోగిస్తారు. మొలకల స్నాక్ లో కూడా బీన్స్ వేస్తారు. ఇది తింటే ఒంటికి చాలా మంచిది. కట్ లెట్స్, వెజ్ కబాబ్స్, న్యూట్రిషియస్ చాట్స్, బర్గర్ పట్టీస్, సూప్స్ వంటి వాటెన్నింటిలోనో కూడా బీన్స్ ను వాడతారు. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అంతేకాదు బ్లడ్ షుగర్ ప్రమాణాలను కూడా తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను పెంచుతాయి. వీటిల్లో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, ఖనిజాలు, విటమిన్లు కూడా బాగా ఉన్నాయి. పైగా వీటిల్లో వెజిటేరియన్ ప్రొటీన్ బాగా ఉంటుంది.

ఉదాహరణకు పంజాబీ శెనగల్లో ఫైబర్, ప్రొటీన్లు బాగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా భోజనానంతర బ్లడ్ షుగర్ ప్రమాణాలను బాగా తగ్గిస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఇక చిక్కుళ్లల్లో వెజిటేరియన్ ప్రొటీన్ బాగా ఉంటుంది. వీటిని సూప్స్, స్ట్యూస్ లో బాగా వాడతారు. వీటిల్లో ఐరన్ కూడా బాగా ఉంటుంది. చిక్కుళ్లు బ్లడ్ షుగర్ ని తగ్గిస్తాయి. పచ్చిబటానీలలో అత్యంత నాణ్యమైన ప్రొటీన్, ఫైబర్, మైక్రోన్యూట్రియంట్లు, యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యవంతమైన బ్లడ్ షుగర్ ప్రమాణాలు ఉండేలా చేయడమే కాదు గుడ్ గట్ బాక్టీరియాను కూడా పెంపొందిస్తాయి. పచ్చిబటానీల్లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఫ్యాట్ సొల్యుబుల్ విటమిన్. ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా ఇది తోడ్పడుతుంది. అంతేకాదు సరిగా బ్లడ్ క్లాటింగ్ జరిగేలా సహకరిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా పచ్చిబటానీలు ఎంతో తోడ్పడతాయి.

కిడ్నీ బీన్స్ లో ఫైబర్ బాగా ఉంటుంది. బ్లడ్ షుగర్ ప్రమాణాలను తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల గుండెజబ్బుల రిస్కు తగ్గుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక రక్తపోటును తగ్గిస్తుందంటున్నారు. వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుందని వైద్యులు చెపుతున్నారు. కిడ్నీ బీన్స్ లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. కిడ్నీ బీన్స్ లాంటి ఫోలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని గర్భిణిలు తీసుకుంటే మంచిదని వైద్యులు చెపుతున్నారు. బ్లాక్ బీన్స్ లో పోషకాలు బాగా ఉంటాయి. ఇవి గట్ బాక్టీరియాపై పాజిటివ్ ప్రభావాన్ని చూపుతాయి. బ్లడ్ షుగర్ ను క్రమబద్ధీకరిస్తాయి. సోయాబీన్స్ లో న్యూట్రియంట్స్ తో పాటు యాంటాక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. సోయాబీన్స్ తినడం వల్ల కాన్సర్ రిస్కు బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. సోయాలోని డయటరీ ఐసోఫ్లోవెన్ వల్ల స్త్రీలలో గుండెజబ్బుల రిస్కు ఎక్కువగా ఉండదు.

అలాగే పల్లీలు కూడా బీన్స్ జాబితాలోనే చేరతాయి. వీటిల్లో మోనోఅన్శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, పోలిఅన్శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ప్రొటీన్, బి విటమిన్స్ బాగా ఉన్నాయి. కాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల రిస్కు పాలబడకుండా పల్లీలు (మోడరేట్ గా తీసుకోవాలి) తగ్గిస్తాయి. శరీర ఆరోగ్యానికే కాదు మీ చర్మం అందానికి కూడా డైట్ లో బీన్స్ చేర్చడం చాలా ముఖ్యమని డైటీషియన్లు సైతం సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News