మేకప్ లేకుండా అందంగా కనిపించాలంటే..
మేకప్ లేకుండా అందంగా కనిపించవచ్చు. ఎలాగంటారా? ఫౌండేషన్ బదులు ఎస్ పిఎఫ్ తో ఉన్న టింటెడ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. ఇది చర్మాన్ని సంరక్షించడమే కాకుండా చర్మానికి కావలసిన హైడ్రేషన్ ను అందిస్తుంది. అలాగే వేడినీళ్లల్లో నిమ్మకాయ రసం పిండి తాగితే శరీరంలోని ఫ్రీరాడికల్స్ తగ్గి చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత ఆల్కహాల్ లేని టోనర్ ను వాడితే స్కిన్ ఎంతో అందంగా కనిపిస్తుంది.
వారానికి ఒకసారి ఎక్స్ ఫొయిలేటింగ్ ప్రాడక్టును లేదా ఇంట్లో తయారుచేసిన బేకింగ్ సోడా, నీటి మిశ్రమంతో చేసిన పేస్టును ముఖానికి రాసుకుని మసాజ్ చేస్తే అది మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని తువ్వాలుతో పొడిగా తుడుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం ఎంతో తాజాగా కనిపించడమే కాదు ఎంతో కాంతివంతగా ఉంటుంది. అలాగే ముఖంపై చాలామంది తరచూ చేతులు పెడుతుంటారు. ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి ఉంటే చిదుముతుంటారు. అలా అసలు చేయొద్దు.