రాత్రి పడుకోబోయేముందు ఇవి చేస్తే మీ అందం రెట్టింపే..
రాత్రి పడుకోబోయేముందు మీరు అనుసరించే కొన్ని బ్యూటీ అలవాట్లు మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి. అవేమిటంటే…
రాత్రిపడుకోబోయే ముందు ముఖంపై మేకప్ అస్సలు ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే చర్మ సమస్యలను కొని తెచ్చుకున్నట్టే. నిద్రలో ఉన్నప్పుడు చర్మం క్లీనింగ్ క్రియ కొనసాగుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపణైన సత్యం.
మేకప్ ఉంచుకుని పడుకోవడం వల్ల మీరు వాడిన కాస్మొటిక్స్ తో రకరకాల చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ అలవాటు వల్ల మచ్చలు, యాక్నే వంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రి పడుకోబోయేముందు చర్మాన్ని సున్నితంగా ఎక్స్ ఫొయిలేట్ చేసుకోవడం వల్ల చర్మంపై చేరిన మలినాలు, మురికి పోతాయి. చర్మ రంధ్రాలకు గాలి బాగా సోకుతుంది.
ప్రతి రోజూ రాత్రి పడుకోబోయే ముందు మీ చేతులను గోరువెచ్చని నీళ్లతో కడుక్కుని మైల్డ్ సోప్ తో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తువ్వాలుతో వాటిని పొడిగా తుడుచుకొని చేతులకు హ్యాండ్ క్రీము పెట్టుకోవాలి. జిడ్డు తక్కువగా ఉండి బాగా చిక్కగా ఉన్న హ్యాండ్ క్రీమును చేతులకు రాసుకోవాలి. ఇది రాత్రి మీ చేతులకు కావాలసినంత మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. హ్యాండ్ క్రీమును రాసుకోవడం వల్ల చేతులు పొడిబారవు. మొరటగా కనిపించవు కూడా. పైగా చూడగానే మీ చేతులు ఎంతో నాజూగ్గా…మరెంతో అందంగా కనిపిస్తాయి.
రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి తప్పనిసరిగా టోనర్ అప్లై చేయాలి. టోనర్ ముఖానికి రాసుకోవడం వల్ల చర్మంలో సహజసిద్ధమైన పిహెచ్ ప్రమాణాలు బాగా ఉంటాయి. దీంతో బాక్టీరియా బారిన మీరు పడరు. అంతేకాదు ముఖచర్మంపై చేరిన మురికిని, మలినాలను కూడా టోనర్ శుభ్రం చేస్తుంది. ఒక కాటన్ పాడ్ పై కొద్దిగా టోనర్ పెట్టి దానితో ముఖాన్ని, మెడను సున్నితంగా రుద్దాలి. ఇలా చేస్తే పొద్దున్న మీ ముఖం, మెడ భాగాలు ఎంతో అందంగా ముద్దొచ్చేలా ఉంటాయి.
నిద్రపోయేముందు ఐ మేకప్ ను పూర్తిగా తొలగించాలి. మాయిశ్చరైజింగ్ ఐ క్రీమును పెట్టుకోవాలి. ఐక్రీము కళ్లకు ఎంతో మంచి చేస్తుంది. ఐ క్రీములో ఉండే పెప్టైడ్స్ వంటి పదార్థాలు మీ కళ్లకు కావలసిన హైడ్రేషన్ ను, మాయిశ్చరైజర్ ను అందిస్తాయి. అంతేకాదు ముడతలు, గీతలు పడకుండా చేస్తాయి. మీరు చేయాల్సిందల్లా లైట్ వెయిట్ ఐ క్రీమును మాత్రమే వాడాలి. అందులో యాంటాక్సిడెంట్లు, కెఫైన్, పెప్టైడ్స్, బ్రైట్నర్స్ బాగా ఉంటాయి.
రాత్రి నిద్రపోయే ముందు జడను పోనీటైల్ మాదిరిగా గట్టిగా కట్టుకుని ముడి వేసుకుని పడుకుంటే మంచిది. ఇలా చేస్తే వెంట్రుకలు ముఖం మీద పడకుండా ఉంటాయి. దీంతో మీ నిద్రకు భంగం వాటిల్లకుండా ప్రశాంతంగా నిద్ర పోతారు.
నిద్రపోయేటప్పుడు పాదాలను శుభ్రంగా కడుక్కొని టవల్ తో పొడిగా తుడుచుకోవాలి. ఆతర్వాత పెట్రోల్ జెల్లీని పాదాలకు రాసుకోవాలి. ఇలా చేస్తే కొద్దిరోజుల్లోనే మీ పాదాలు నునుపుదేలి ఎంతో నాజూగ్గా కనిపిస్తాయి. చర్మం పొడిబారకుండా ఉండడానికి పెట్రోలియం జెల్లీ వాడతారు.
రాత్రి పడుకోబోయే ముందు దంతాలను తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల నోరు దుర్వాసన రాదు. రాత్రి డిన్నర్ చేసిన అరగంట తర్వాత పండ్లను శుభ్రం చేసుకోవాలి. గోరు వెచ్చని నీటితో నోరును బాగా పుక్కిలించాలి. దంతాల ఫ్లోసింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి. అయితే ఈ ఫ్లోజింగ్ ను దంతాలు బ్రష్ చేసుకునే ముందే చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి.
రాత్రి తలకింద సిల్కు పిల్లో కేసు ఉన్నదిండు పెట్టుకుంటే మంచిది. సిల్కులో సహజసిద్ధమైన ప్రొటీన్లతో పాటు 18 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. అవి చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచివి. కాటన్ పిల్లో కేసుల్లాగ కాకుండా సిల్కు పిల్లో కేసులు వాడడం వల్ల ముఖంపై సిల్కు లైన్స్ పడవు.
నిద్రలేమి వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. కళ్ల కింద చర్మంపు సంచులు కూడా ఏర్పడతాయి. ఇవి మీ అందాన్ని దెబ్బతీస్తాయనడంలో సందేహం లేదు. అందుకే ప్రతిరోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు మంచి నిద్ర పోవాలి. నిద్రను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. అలా నిద్రను నిర్లక్ష్యం చేస్తే మీ అందం, ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. వీటిని పాటించడం వల్ల మీ అందం దీర్ఘకాలం బాగా ఉంటుంది. యంగ్ గా కనిపిస్తారు.
విటమిన్ సి, హెలూరొనిక్ యాసిడ్ సిరమ్స్ రాత్రిపూట రాసుకోవడం చర్మానికి ఎంతో మంచిది. ముఖ్యంగా చర్మంలోని మాయిశ్చరైజర్ ని అవి పరిరక్షిస్తాయి. చర్మం హైడ్రేటెడ్ గా ఉండేట్టు సహకరిస్తాయి. అయితే ఒక రాత్రి స్కిన్ కేర్ పాటించకపోవడం వల్ల చర్మం దెబ్బతినదు కానీ పొడిచర్మంతో ఉదయం లేస్తారని మరవొద్దు. చర్మం పొడిబారడం వల్ల స్కిన్ మొద్దుబారినట్టు, బిగుసుకుపోయినట్టు ఉంటుంది. సో…రాత్రి ఈ అలవాట్లును పాటించండి. మీ బ్యూటీని రెట్టింపు చేసుకోండి….