Sunday, October 6, 2024
Homeహెల్త్Beauty tips: అందం కిటుకులు

Beauty tips: అందం కిటుకులు

 ఉదయమే గోరువెచ్చని నిమ్మనీళ్లు తాగితే ముఖం మెరుపును సంతరించుకుంటుంది.
 తొడల మధ్య ఏర్పడ్డ నల్లదనం పోవాలంటే కొన్ని చుక్కల నిమ్మరసంలో ఒక టీస్పూను అలొవిరా జెల్, ఒక టీస్పూను పాలు, చిటికెడు పసుపు వేసి మూడింటినీ బాగా కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును నల్లగా ఉన్న తొడల భాగంలో పూసి ఇరవై నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆతర్వాత చల్లటి నీళ్లతో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడుక్కొని టవల్ తో పొడిగా తుడుచుకోవాలి.
 ముఖంపై ఉన్న మ్రుతకణాలు పోవాలంటే పెరుగుతో ఐదు నిమిషాలు ముఖంపై రుద్దాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే చర్మం పరిశుభ్రమై ఇన్స్టాంట్ మెరుపును సంతరించుకుంటుంది.

- Advertisement -

 నిమ్మనీళ్లతో ముఖాన్ని ఆవిరి పెట్టుకోవడం వల్ల చర్మం బాగా క్లీన్ అవడమే కాకుండా యాక్నే, మొటిమలు తగ్గుతాయి. ముఖం కాంతివంతం అవుతుంది.
 వారానికి ఒకరోజు ఉఫవాసం ఉండి, నీటితో సరిపెట్టుకుంటే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడ్డమే కాదు బరువు తగ్గుతారు.
 పరిశుభ్రమైన చర్మం కోసం ప్రతి రోజు టొమాటో ముక్కతో ముఖాన్ని ఐదు నిమిషాలు రుద్ది సున్నితంగా మసాజ్ చేయాలి. ఆతర్వాత దానిపై తేనె కొద్దిగా వేసి రుద్దాలి. ఇలా నిత్యం చేయడం వల్ల యాక్నే, మొటిమలు, నల్లమచ్చలు పోతాయి. చర్మం యొక్క జిడ్డు తగ్గుతుంది.
 నోటి దుర్వాసన పోవాలంటే రెండు లేదా మూడు లవంగాలు నోట్లో వేసుకుని నమలాలి.
 ఆముదం నూనె చర్మంపై ముడతలు పోగొడుతుంది. పొట్టపై ఉండే స్ట్రెచ్ మార్కులు కూడా పోతాయి. అంతేకాదు ఆముదం నూనె పెదాలను మ్రుదువుగా చేస్తుంది. జుట్టు బాగా పెరుగుతుంది. కనుబొమలపై జుట్టు తక్కువగా ఉన్నవాళ్లు వాటిపై ఆముదం నూనె రాసుకుంటే జుట్టు పెరిగి చిక్కటి కనుబొమలు ఏర్పడతాయి.
 తలకు షాంపు పెట్టుకుని స్నానం చేసిన తర్వాత అలొవిరా జెల్, తేనె, పెరుగు మూడింటినీ కలిపి మిశ్రమం చేసి దాన్ని వెంట్రుకలకు పట్టిస్తే నేచురల్ కండిషనర్ గా పనిచేస్తుంది.
 మెంతులతో జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. మెంతులు చుండ్రును కూడా నివారిస్తాయి.
 కొందరికి తొడలపై డార్క్ పోర్స్ ఏర్పడతాయి. ఇవి పోవాలంటే అరకప్పు కాఫీ పొడి, అరకప్పు తాటిబెల్లం, పావు కప్పు కొబ్బరినూనె తీసుకని బౌల్ లో పోసి స్క్రబ్ లా చేయాలి. దానితో బ్లాక్ పోర్స్ పై వ్రుత్తాకారంలో సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ఆ ప్రదేశాన్ని కడుక్కోవాలి.

 నానబెట్టిన ఐదు లేదా ఆరు బాదం పప్పులు రోజూ ఉదయమే తినడం వల్ల బరువు తగ్గుతారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల శిరోజాలు కూడా నల్లగా నిగనిగలాడతాయి. చర్మానికి కావలసినంత తేమ అందుతుంది. చర్మం మ్రుదువుగా తయారవుతుంది.
 పొత్తికడుపు ఫ్లాట్ గా అవాలంటే డిటాక్స్ వాటర్ తీసుకోవాలి. దీన్ని ఎలా తయారుచేయాలంటే రెండు లీటర్ల నీటిని తీసుకుని అందులో ఒక టీస్పూను తురిమిన తాజా అల్లంతో పాటు మీడియ సైజు నిమ్మకాయను సన్నటి గుండ్రటి చెక్కలుగా కట్ చేసి ఆ నీళ్లల్లో వేయాలి. వీటితో పాటు పన్నెండు పుదీనా ఆకులు, తొక్కతీసి సన్నగా తరిగిన కీరకాయముక్కలను కూడా ఆ నీటిలో వేసి తాగాలి.
 బేబీ హెయిర్ పెరగాలంటే ఒక టేబుల్ స్పూను బాదం నూనెలో అర టేబుల్ స్పూను ఆముదం నూనె వేసి బాగా కలిపి బేబీ హెయిర్ ఉన్న ప్రదేశంలో పట్టించి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రాత్రంతా ఉంచుకోవచ్చు. లేదా షాంపు పెట్టుకోవడానికి మూడు నాలుగు గంటల ముందు బేబీ హెయిర్ ఉన్న చోట దీన్ని రాయాలి. ఇలా రోజు మార్చి రోజు చేయడం వల్ల బేబీ హెయిర్ వేగంగా పెరుగుతుంది.
 మేకప్ వేసుకునే ముందు ఐస్ ముక్కతో ముఖాన్ని సున్నితంగా రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు బాగవుతాయి. తెల్ల చర్మంపై ఉండే దద్దుర్లు పోతాయి. మేకప్ కూడా చెరిగిపోకుండా ఎక్కువ గంటలు ఉంటుంది.
 తేనె, బంగాళాదుంప జ్యూసు రెండింటినీ బాగా కలిపి ఆ రసాన్ని బ్రష్ తో చర్మంపై పూసుకుని ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఏర్పడ్డ నల్ల మచ్చలు, గీతలు పోతాయి.

 పగిలిన పాదాలకూ కొబ్బరినూనె పట్టించి సాక్సు వేసుకొని పాదాలను అలాగే రాత్రంతా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఏర్పడ్డ చర్మం పగుళ్లు పోతాయి.
 దంతాలను శుభ్రంగా తోమిన తర్వాత ఆర్గానిక్ కొబ్బరినూనెను చిగుళ్లకు పట్టిస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News