Sunday, October 6, 2024
Homeహెల్త్Beauty tips: అందానికి వంటింటి చిట్కాలు

Beauty tips: అందానికి వంటింటి చిట్కాలు

 ముఖానికి పసుపు రాసుకుంటే యాక్నే పోతుంది. ముఖంపై అవాంఛనీయరోమాలు రాకుండా ఇది నిరోధిస్తుంది. అంతేకాదు కళ్లకింద నల్లవలయాలు పోతాయి. చర్మం ముడతలు పడదు.

- Advertisement -


 తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే పొడిచర్మం ఉన్నవారు తేనెను రాసుకుంటే చర్మానికి కావలసిన తేమను అది అందిస్తుంది. అంతేకాదు బాక్టీరియల్ యాక్నేను కూడా తేనె వాడకం తగ్గిస్తుంది. యాంటిఏజింగ్ ఏజెంటుగా కూడా తేనె పనిచేస్తుంది.


 వంటింట్లో వాడే కొబ్బరినూనె మేకప్ రిమూవర్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఎక్స్ ఫోయిలేటింగ్ ఏజెంటుగా కూడా పనిచేస్తుంది. చర్మంపై ఉండే డ్రై పాచెస్ కు కావలసిన మాయిశ్చరైజర్ ని అందిస్తుంది.

 చర్మంపై ఏర్పడ్డ స్ట్రెచ్ మార్క్సు, యాక్నేలను నిమ్మకాయ పోగొడుతుంది. పగిలిన పెదాలపై రాస్తే చర్మం మ్రుదువుగా అవుతుంది. వయసు కనిపించకుండా ఉండేలా చర్మాన్ని యంగ్ గా ఉంచుతుంది.

 చర్మంపై తలెత్తిన మొటిమలను అల్లం పోగొడుతుంది. సహజసిద్ధమైన క్లీన్సర్ గా ఇది పనిచేస్తుంది. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

 నల్లమిరియాలు వయసు కనపడకుండా చేయడంలో ఎంతో తోడ్పడతాయి. చర్మంపై ఉండే మ్రుతకణాలను, మలినాలను కూడా పోగొడతాయి. యాక్నేను తగ్గించడంతోపాటు చర్మం మెరిసేలా చేస్తుంది.


 నువ్వుల నూనె ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది సహజసిద్ధమైన క్లీన్సర్. చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. యాంటీ ఏజింగ్ ఏజెంట్ కూడా. వయసు కనిపించకుండా చర్మాన్ని యంగ్ గా ఉంచుతుంది.


 శెనగపిండి చర్మానికి ఎక్స్ ఫొయిలేటింగ్ ఏజెంటుగా బాగా పనిచేస్తుంది. చర్మంపై ఉండే ట్యాన్ ని పోగొట్టి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాదు చర్మంపై మొటిమలు రాకుండా సంరక్షిస్తుంది కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News