Sunday, July 7, 2024
Homeహెల్త్Beauty tips: ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి

Beauty tips: ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి

 గ్లాసు నీటిలో ఉసిరి పొడి వేసి రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్న లేచిన తర్వాత ఈ మిశ్రమంతో కళ్లు కడుక్కుంటే తాజాగా

- Advertisement -

ఉండడంతో పాటు మిల మిల మెరుస్తాయి కూడా.

 తులసి ఆకులను నూరి ఆ పేస్టును ముఖానికి రాసుకుంటే మచ్చలు పోయి ముఖం అందంగా కనిపిస్తుంది.

 టొమాటో, నిమ్మరసం కలిపిన ప్యాక్ ను ముఖానికి పూసుకుంటే చర్మంపై జిడ్డుపోతుంది.

 మందారపూవులను నూనెలా తయారు చేసి తలకు రాసుకుని అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది.

 అరటిపండు గుజ్జును కళ్ల చుట్టూ రాసుకుని పావుగంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కంటిచుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గుతాయి.

 గంధం, రోజ్ వాటర్ కలిపి ఆ పేస్టును చెమటకాయలు ఉన్నచోట రాసుకుని పదినిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో

కడిగేసుకోవాలి.

 ఒత్తైన వెంట్రుకలకు బాదం నూనె రాసుకుంటే అవి రాలిపోవు.

 కొన్ని మెంతులు తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పేస్టులో కాస్త తేనె కలిపి ముఖానికి పూసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మ్రుదువుగా తయారవుతుంది. వయసు కనిపించదు.

 కరివేపాకు చిగురు, పసుపు, వేపాకు కలిపి నూరి మొటిమలకు పెడితే అవి పోతాయి.

 అరస్పూను నిమ్మరసానికి కాస్తంత గ్లిజరిన్ జోడించి ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న నల్లమచ్చలు పోతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News