Health Tips With Tamarind Seeds: తెలుగు లోగిళ్లలో చింతపండు అంటే ఇష్టపడని వారుండరు. చింతపండు పులిహోర, చింతకాయ పచ్చడి, చింత పులుసు.. ఇలా చింతకాయతో చేసే ఏ వంటకమైనా వేడి వేడి అన్నంలోకి లాగించేస్తారు. కానీ అదే చింతపండులోని చింతగింజలను మాత్రం తీసి పక్కన పడేస్తాం. కానీ చింతపండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. చింత గింజల్లో కూడా మేలైన పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా..
సాధారణంగా ఎవరైనా సరే చింతపండును వాడిన తర్వాత ఆ గింజలను పడేస్తారు. కానీ ఈ గింజల్లో కూడా బోలెడన్నీ పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు, ఔషధ గుణాలు.. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయట. చింతగింజల్లోని పోషకాల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలైనా కూడా పరార్ అయిపోతాయి. ఇంతకీ ఇందులోని పోషకాలు ఏంటంటే..
చింత గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి బాధపడేవారు చింతగింజలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ఈ గింజల పొడిలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల.. ఈ గింజలతో పొడి తయారు చేసుకుని తీసుకుంటే శరీరంలో వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. తద్వారా ఒంట్లోని అన్ని నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. చింత గింజల్లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచడంతో గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
చింతగింజలను తరచుగా తీసుకుంటే చర్మ సమస్యలను తగ్గించడంతో పాటు.. వేడి నీటిలో కలిపి చింత గింజల పొడిని తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం చేకూరుస్తుంది. ఈ చింత గింజల పొడిని పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి రాసుకుంటే.. పిగ్మెంటేషన్ సమస్య బారిన పడకుండా చేస్తుంది. ముఖం కూడా కాంతివంతంగా మెరిసిపోతుంది. వృద్ధ్యాప్య లక్షణాలను తగ్గిస్తుంది.


