Sunday, November 16, 2025
Homeహెల్త్Stale Roti: రాత్రి మిగిలిన రోటీలు ఉదయాన్నే తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

Stale Roti: రాత్రి మిగిలిన రోటీలు ఉదయాన్నే తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

Stale Roti Benefits: భారతీయ ఆహారాలలో రోటీ ఒక ముఖ్యమైన వంటకం. దీనిని చట్నీ, కూరగాయలు, నాన్ వెజ్ వంటి అనేక వంటకాలతో కలిపి తింటారు. చాలామంది సులభంగా బరువు తగ్గవచ్చని రోటీని రాత్రిపూట తినడానికి మొగ్గు చూపుతారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని ఇస్తుంది. తద్వారా రోజంతా ఎంతో చురుగ్గా ఉండవచ్చు. కామన్ గా రాత్రి రోటీలు తిన్న తర్వాత కొన్ని రోటీలు మిగిలిపోతాయి. అయితే, మరుసటి రోజు అల్పాహారంలో వాటిని తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ రోటీలు కొంచెం గట్టిగా అయినప్పటికీ వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

రాత్రి మిగిలిన రోటీలు ఉదయం అల్పాహారంలో చేర్చుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది డయాబెటిస్ చికిత్సలో సహాయపడుతుంది. రాత్రంతా రోటీలను ఉంచడం ద్వారా అవి తేలికపాటి ఫెర్మెంటేషన్ కు లోనవుతాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసే, రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధించే ఒక రకమైన ఫైబర్. రోటీ మరిన్ని ప్రయోజనాల కోసం చల్లని పాలలో జోడించి కూడా తినవచ్చు.

also read:Health : డయాబెటిస్ రోగులు బంగాళదుంపలు తింటే ఏమౌతుందో తెలుసా..!

ఉదయం రోటీ తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి జీర్ణ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫెర్మెంటేషన్ సమయంలో ఏర్పడే స్టార్చ్ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాను పోషించడానికి పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచే గట్ మైక్రోబయోమ్‌ను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీని తినడం వల్ల మలబద్ధకం, పొత్తికడుపు వాపు, గ్యాస్ వంటి సమస్యలు కూడా నయమవుతాయి.

రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవాలనుకుంటే, ఉదయం అల్పాహారంలో రోటీలను ఉండేలా చూసుకోవాలి. రోటీ ఫెర్మెంటేషన్ గురైనప్పుడు, ప్రీబయోటిక్స్ ఏర్పడటం ప్రోత్సహించబడుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ముఖ్యమైన ప్రయోజనకరమైన గట్ బాక్టీరియాను పోషిస్తాయి. రోటీని ఆహారంలో భాగం చేసుకుంటే అనేక వ్యాధుల దరిచేరవు.

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి మిగిలిన రోటీలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం వాటిలో కేలరీలు తక్కువగా ఉండటం. రోటీలలో స్టార్చ్, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇది తినే కేలరీల పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రతి ఉదయం మిగిలిన రోటీలు తింటే అనేక పోషకాలు లభిస్తాయి. రోటీలలో ఉండే స్టార్చ్ రెసిస్టెంట్ స్టార్చ్‌ను ఏర్పరుస్తుంది. ఇది ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఈ ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

 

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad