Pulses For High Uric Acid: యూరిక్ యాసిడ్ స్థాయి ఎక్కువగా ఉండి పప్పుధాన్యాలను పూర్తిగా తినడం మానేస్తే, ఈ వార్త చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు తరచుగా పప్పుధాన్యాలను తీసుకోవడం హానికరమని భావిస్తుంటారు. అయితే, ఈ అపోహ ఏమాత్రం నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. సరైన పప్పుధాన్యాలు సరైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదంటున్నారు డైటీషియన్లు. యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థం. ఇది సాధారణంగా మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది. అయితే, అధికంగా ఏర్పడినప్పుడు లేదా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే దాని స్థాయి రక్తంలో పెరుగుతుంది. దీనిని హైపర్‌యూరిసెమియా అని అంటారు. దీని వల్ల కీళ్ల నొప్పులు, గౌట్, మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు రావచ్చు. ఈ నేపథ్యంలో అధిక యూరిక్ యాసిడ్ ఉంటె ఏ పప్పులు తినాలి..? ఏవి తినకూడదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
అన్ని పప్పుధాన్యాలు ప్రమాదకరమా?
డైటీషియన్ల ప్రకారం..అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు అన్ని పప్పుధాన్యాలు పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు. పప్పుధాన్యాల్లో ప్యూరిన్ కంటెంట్ ముఖ్యం, ఎందుకంటే? ప్యూరిన్లు శరీరంలో విచ్ఛిన్నమై యూరిక్ యాసిడ్‌గా ఏర్పడుతుంది. కాబట్టి ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాలు హానికరం కావచ్చు. ఒక వ్యక్తిలో యూరిక్ యాసిడ్ స్థాయి 8 mg/dL కంటే ఎక్కువగా ఉంటే వారు అదనపు జాగ్రత్త తీసుకోవాలి. ఈ పరిస్థితిలో తక్కువ ప్యూరిన్ ఉన్న పప్పులు, కాయధాన్యాలు మాత్రమే పరిమిత పరిమాణంలో తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.
ఏ పప్పులు ఆరోగ్యకరమైనవి?
ముంగ్ బీన్స్‌లో అత్యల్ప ప్యూరిన్ కంటెంట్ ఉంటుంది. ఇందులో 25 నుండి 35 mg ప్యూరిన్ ఉంటుంది. వీటిని ప్రతిరోజూ పరిమిత పరిమాణంలో తినవచ్చు. అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్నవారికి ఇవి సురక్షితమైనవి.
ఏ పప్పులు పరిమిత పరిమాణంలో తినాలి?
మైసూర్ పప్పు, కందిపప్పు, పెసలలో 35 నుండి 50 mg ప్యూరిన్ ఉంటుంది. వీటిని వారానికి మూడు నుండి నాలుగు సార్లు తినవచ్చు. కాకపోతే, వంట చేయడానికి ముందు వాటిని 6 నుండి 8 గంటలు నానబెట్టాలి. ఇదే సమయంలో తెల్ల మినుములు, ఉలవలు, హోల్ పప్పులలో 60 నుండి 75 mg ప్యూరిన్ ఉంటుంది. వీటిని వారానికి రెండు నుండి మూడు సార్లు తినడం సురక్షితం. ఈ విధంగా ప్యూరిన్ పరిమాణాన్ని నియంత్రించి, అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలను కుదించడం సాధ్యమవుతుంది.
ఏ పప్పుధాన్యాలు నివారించాలి?
శనగలు, కిడ్నీ బీన్స్, నల్ల మినుములలో 75–90 mg ప్యూరిన్ ఉంటుంది. అందువల్ల వీటికి ఎంత దూరం ఉంటెయ్ అంతమంచిది లేదా ప్రతి 10–15 రోజులకు ఒకసారి మాత్రమే తినేలా చూసుకోవాలి. మరోవైపు సోయాబీన్స్, సోయా ముక్కలు అత్యధిక ప్యూరిన్ (120–140 mg) కలిగి ఉంటాయి. అందువల్ల అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్నవారు వీటిని పూర్తిగా నివారించాలి.

