Best Home Remedies for Low Blood Pressure: నేటి ఆధునిక కాలంలో ప్రధాన ఆరోగ్య సమస్యల్లో లోబీపీ కూడా ఒకటి. చిన్న వయస్సులోనూ చాలా మంది లోబీపీ భారీన పడుతున్నారు. లోబీపీతో బాధపడేవారు అకారణంగా కళ్ళు తిరగడం, పడిపోవడం, తీవ్రమైన నీరసం, ఒళ్లంతా చెమటలు పట్టడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్య ఉన్నవారు సొంత పనులు కూడా చేసుకోలేనంతగా నిస్సత్తువకు లోనవుతుంటారు. సాధారణంగా లోబీపీ తగ్గడానికి నీటిలో ఉప్పు కలుపుకుని తాగమని వైద్యులు సలహా ఇస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, లోబీపీ అనేది హైబీపీ అంత తీవ్రమైన జబ్బు కానప్పటికీ.. ఇది శరీరంలో ఉండే మానసిక బలహీనత, శక్తి స్థాయిలు తగ్గడానికి కారణమవుతుంది. ముఖ్యంగా హిమోగ్లోబిన్ లోపం, బీ-కాంప్లెక్స్ లోపం కారణంగానే ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
లోబీపీకి ప్రధాన కారణాలు ఇవే..
కృత్రిమ సోడియం వినియోగం
సహజమైన సోడియం ఉండే ఆహారాలకు బదులు కృత్రిమమైన సోడియంను తరచుగా తీసుకోవడం వల్ల సోడియం వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు కూడా లోబీపీ వస్తుంది.
ఉడికించిన ఆహార అలవాటు
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కేవలం ఉడికించిన ఆహారం తినే అలవాటు ఉన్నవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. తిన్నది త్వరగా జీర్ణం కాక, బలహీనంగా మారి, రక్తహీనతకు గురై లోబీపీ వచ్చే అవకాశం ఉంది.
విటమిన్లు లేని ఆహారం
శరీరానికి అవసరమైన విటమిన్లు, ఎంజైములు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల లోబీపీ సంభవిస్తుంది. ఐరన్ లోపం లోబీపీకి దారితీస్తుంది.
సోడియం-పొటాషియం అన్‌బ్యాలెన్స్
పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకపోవడం వలన సోడియం, పొటాషియంల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది.
లోబీపీ నివారణకు చక్కటి పరిష్కారాలు..
దానిమ్మ జ్యూస్
లోబీపీ ఉన్నవారు దానిమ్మ గింజల జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది.
క్యారెట్-బీట్‌రూట్ జ్యూస్
లోబీపీ సమస్య తగ్గాలంటే ఉదయం, సాయంత్రం క్యారెట్-బీట్‌రూట్ జ్యూస్ తాగాలి. కావాలనుకుంటే ఇందులో తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు.
ఫైబర్ ఉండే పండ్లు
గ్యాస్ ట్రబుల్ లేకుండా, మోషన్ ఫ్రీగా ఉండాలంటే ఫైబర్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. రోజులో 25-30% ఆహారం పండ్లు ఉండేలా చూసుకోవాలి. వాటిల్లో బొప్పాయి, దానిమ్మ, కర్బూజా, పుచ్చకాయ, జమకాయ పండ్లు ఇంకా ఎక్కువ మేలు చేస్తాయి.
గోధుమ గడ్డి రసం
ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం. గోధుమ గడ్డి రసాన్ని ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు తేనె, నిమ్మరసం కలిపి తాగితే లోబీపీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ 15 రోజుల పాటు ఈ డైట్‌ను అనుసరించడం ద్వారా లోబీపీ, నీరసం, ఐరన్ లోపం, బీ-కాంప్లెక్స్ లోపాల నుంచి బయటపడవచ్చు.


