Thursday, November 21, 2024
Homeహెల్త్Best skin care on new year eve: వావ్ అనే చర్మ సౌందర్యం కోసం..

Best skin care on new year eve: వావ్ అనే చర్మ సౌందర్యం కోసం..

కొత్త సంవత్సరంలోకి ఇంకొన్ని రోజుల్లో అడుగుపెట్టబోతున్నాం. భవిష్యత్తు కూడా కొత్తగా, మరింత అందంగా ఉండాలని కోరుకుంటాం. అంతేకాదు ఇప్పటికన్నా కూడా మరింత ఎక్కువ అందంతో కనిపించాలనీ తపనపడతాం. మన అందాన్ని రెట్టింపు చేసేది చర్మం కాబట్టి దానికి బెస్ట్ స్కిన్ టిప్స్ పాటించాలని భావిస్తాం. కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న క్షణాల్లో అలాంటి కొన్ని బెస్ట్ స్కిన్ కేర్ టిప్స్ మీకోసం..

- Advertisement -

 నెరొలీ ఎసెన్షియల్ ఆయిల్ పొడిచర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. బాదం నూనెలో ఈ ఆయిల్ ని రెండు చుక్కలు కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అలా నూనెతో మసాజ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నతువ్వాలును ముఖంపై కప్పుకొని కొద్దిసేపు అలాగే ఉండాలి. ఇలా చేయడం వల్ల చర్మం లోపలికి ఆయిల్ ఇంకుతుంది. దీంతో బాగా రిలాక్స్ అవుతారు.

 వేడి నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మంలోని నూనె పోయి పొడారినట్టు అవుతుంది. అందుకే వేడినీళ్లకు బదులు గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. స్ట్రాంగ్ గా ఉండే సోప్స్ లేదా క్లీన్సర్స్ వాడొద్దు. అలా చేస్తే చర్మంలోని నూనె ఇంకిపోయి చర్మం ఎండిపోయినట్టు అవుతుంది. చర్మం తేమగుణాన్ని కోల్పోతుంది. గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేసిన తర్వాత లేదా ముఖం కడుక్కున్న తర్వాత తువ్వాలుతో మ్రుదువుగా ఒత్తుతూ శరీరాన్ని తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో తేమ ఉండి దాని మాయిశ్చరైజింగ్ గుణాన్ని కోల్పోదు.

 చర్మం కాంతివంతంగా, మ్రదువుగా ఉండాలంటే ఆరోగ్యకరమైన డైట్ ని తీసుకోవాలి. తాజా పళ్లు, కూరగాయలు బాగా తినాలి. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే వాటిని తినాలి. ఫిష్ ఆయుల్ , ఫిష్ ఆయుల్ సప్లిమెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ లేని ఆహార పదార్థాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు తినడం వల్ల చర్మం యంగ్ లుక్ ను కలిగి ఉంటుంది. నీళ్లు కూడా బాగా తాగాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో తేమ స్వభావం పోదు.

 విపరీతమైన స్ట్రెస్ వల్ల రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. అందుకే మైండ్ ను ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా పెట్టుకోవాలి. బాగా నిద్రపోవడం వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.

 స్కిన్ టోనర్స్ వాడడం వల్ల చర్మం మాయిశ్చరైజింగ్ గుణాన్ని కోల్పోదు. టోనర్స్ చర్మంలోని మలినాలను పోగొట్టి చర్మాన్ని నున్నగా మెరిసేలా ఉంచుతాయి.

 కళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. కళ్ల కింద నల్ల వలయాలు ఏర్పడకుండా ఉండేందుకు క్రీములు , జెల్ వాడాలి. కళ్ల పై బంగాళాదుంప ముక్కలను పెట్టుకుని కాసేపు అలాగే ఉంచుకుంటే కళ్లు విశ్రాంతిని పొంది విప్పారినట్టు పెద్దవిగా కనిపిస్తాయి.

 అరటి పండు ఫేస్ ప్యాక్ ముఖ చర్మానికి కావలసినంత మాయిశ్చరైజర్ ని అందజేస్తుంది. ఒక అరటి పండు తీసుకుని గుజ్జుగా చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె, పావు టీస్పూను పాలమీగడ లేదా పాలపొడి, రెండు చుక్కలు శాండల్ వుడ్ ఆయిల్ వేసి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీటితో ముఖాన్ని కడిగేసుకుని మాయిశ్చరైజర్ ని రాసుకోవాలి.

 వాటర్ బేస్డ్ లైట్ వైట్ ఫౌండేషన్ వాడాలి. దీని వల్ల చర్మంపై మేకప్ గ్రీజీగా ఉండకుండా తేలికగా ఉండి ముఖం ఎంతో నాజూగ్గా కనిపిస్తుంది.

 కనీసం రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల చర్మం తేమగా ఉండడంతోపాటు చర్మంలోని మలినాలు కూడా బయటకు పోతాయి.

 పసుపు రాసుకోవడం వల్ల చర్మంలో కొత్త కణాలు వ్రుద్ధిచెందుతాయి. కణాలు దెబ్బతినకుండా పసుపు కాపాడుతుంది. దీంతో చర్మంపై ఏజింగ్ ఎఫెక్టు కనపడదు కూడా. పసుపులో కొద్దిగా బియ్యప్పిండి కలిపి ఆ మిశ్రమాన్ని వారానికి ఒకసారి చర్మానికి రాసుకుంటే చర్మంపై ముడతలు, గీతలు ఏర్పడవు.

 బాదం నూనెలో రెండు చుక్కల జాస్మిన్ ఆయుల్ చేర్చి చర్మానికి మసాజ్ చేసుకున్నట్టు రాసుకుని వేడి టవల్ ముఖంపై వేసుకుని కాసేపు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేస్తే చర్మంలోని ఎలాస్టిసిటీ గుణం పోదు.

 ఇంట్లోనే రోజ్ టోనర్ తయారుచేసుకోవచ్చు. నీటిలో మూడు నాలుగు చుక్కల రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి ముఖానికి రాసుకుంటే రోజంతా చర్మం ఎంతో తాజాగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News