Sunday, October 6, 2024
Homeహెల్త్Best snacks: నానబెట్టిన వాల్ నట్స్ సూపర్ ఫుడ్

Best snacks: నానబెట్టిన వాల్ నట్స్ సూపర్ ఫుడ్

వాల్ నట్స్ ను నానబెట్టి తింటే అందులోని పోషకాలను పూర్తి స్థాయిలో పొందగలమంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు. నానబెట్టిన వాల్ నట్స్ తింటే జీర్ణక్రియ సులభమవుతుంది. శరీరంలోని బ్లడ్ షుగర్ ప్రమాణాలను ఇవి క్రమబద్ధీకరిస్తాయి. రోజూ వీటిని నీళ్లల్లో నానబెట్టుకుని తినడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది.

- Advertisement -

వీటిల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒత్తిడి, డిప్రషన్, యాంగ్జయిటీలని తగ్గిస్తాయి. వాల్ నట్స్ లో కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర బరువును తగ్గించడంలో ఎంతో సహకరిస్తాయి. వీటిని తినడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య కూడా తలెత్తదు. ఒక కప్పు నీళ్లల్లో రెండు నుంచి నాలుగు వాల్ నట్స్ వేసి ఐదారు గంటల పాటు నానబెట్టి తినొచ్చు.

రాత్రి నిద్రపోయేముందు గ్లాసుడు పాలతో పాటు నానబెట్టిన వాల్ నట్స్ తింటే మంచిది. వీటి ద్వారా శరీరానికి ఎక్కువ మోతాదులో న్యూట్రియంట్లు అందుతాయి. ఇవి శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ ని అందించడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు వీటిల్లో సూక్ష్మపోషకాలు, విటమిన్లు, ఖనిజాలు బాగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బ్రెయిన్ చురుగ్గా పనిచేయడమే కాదు మెమరీ పవర్ బాగా పెరుగుతుంది.

వాల్ నట్స్ గుడ్ స్నాక్ కూడా. వీటిని కొద్దిగా తింటే చాలు కడుపు నిండినట్టు ఉంటుంది. వాల్ నట్స్ లోని పీచుపదార్థాల వల్ల తొందరగా ఆకలి కూడా వేయదు. దాంతో చిరుతిళ్ల జోలికే పోము. దీంతోశరీరం బరువు పెరగదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా చేరదు. వీటిల్లోని ప్రొటీన్లు, పీచుపదార్థాలు రక్తంలోని షుగర్ ప్రమాణాలను నియంత్రిస్తాయి. ప్రొటీన్ షేక్స్, స్మూదీస్ లో వీటిని వేసుకొని తింటే శరీరానికి గుడ్ కొలెస్ట్రాల్ బాగా అందుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News