Banana Eating: మనం ఆరోగ్యాంగా ఉండాలన్న, శక్తివంతంగా ఉంటాలన్న డైట్ లో పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, అతి తక్కువ ధరకు, సులభంగా లభించే ఆరోగ్యకరమైన పండ్ల గురించి మాట్లాడితే, అరటిపండు మొదటగా వినిపించే పేరు. చాలామంది తరచుగా అరటిపండ్లను సాధారణ పండ్లుగా పరిగణించి లైట్ తీసుకుంటారు. కానీ ఇది తక్షణ శక్తి, పోషకాహారం, ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన పండని ఎవరికి తెలియదు. అరటిపండ్లను సరైన సమయంలో తీసుకుంటే, దాని ప్రయోజనాలు అనేక రెట్లు పెరుగుతాయి. ఇది శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో అరటి పండు ఏ సమయంలో తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. ఉదయం నిద్రలేచిన తర్వాత అరటిపండు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
2. ఇందులో ఉండే విటమిన్-B6, పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
3. అరటిపండు జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది. అంతేకాదు, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
వ్యాయామానికి ముందు అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. జిమ్ లేదా యోగా చేసేవారికి అరటిపండు అనేది వ్యాయామానికి ముందు ఒక బెస్ట్ స్నాక్.
2. దీనిలో లభించే కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
3. ఇందులో ఉండే పొటాషియం కండరాలను బలంగా ఉంచుతుంది.
4. సెషన్ అంతటా చురుగ్గా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది.
మధ్యాహ్నం తర్వాత అరటిపండు తినవచ్చా?
1. భోజనం తర్వాత అరటిపండు తినడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
2. దీనిలో ఉండే ఫైబర్ ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
3. అరటిపండు శరీరం నుండి విష వ్యర్థాలను తొలగిస్తుంది. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
4. ఇది కడుపు చికాకు, ఆమ్లత్వం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
సాయంత్రం అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. సాయంత్రం ఆకలిగా అనిపించినప్పుడు, జంక్ ఫుడ్ బదులుగా అరటిపండు తినాలి.
2. ఇది శరీరానికి తేలికపాటి శక్తిని అందిస్తుంది. అనారోగ్యకరమైన చిరుతిండిని తినే అలవాటును నివారిస్తుంది.
3. ఇందులో ఉండే సహజ చక్కెర తీపి తినాలనే కోరికను తీరుస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


