Wednesday, March 11, 2026
Homeహెల్త్Tea Health Benefits: టీ తాగే అలవాటుందా? అయితే ఈ హెల్త్ సీక్రెట్స్ మీ కోసమే

Tea Health Benefits: టీ తాగే అలవాటుందా? అయితే ఈ హెల్త్ సీక్రెట్స్ మీ కోసమే

Tea Health Benefits: ఉదయం లేవగానే మనం టీ తాగితే ఆ కిక్కే వేరబ్బా… కప్పు చేతిలో పడగానే ఆ వేడి ఆవిరి ముఖాన్ని తాకుతుంటే నిద్రంతా ఒక్కసారిగా పారిపోతుంది. మొదటి సిప్ లోనే గొంతు దాటి శరీరమంతా ఒక ఎనర్జీ పరుగెత్తినట్టు ఫీలింగ్ వస్తుంది. మైండ్ అలర్ట్ అవుతుంది, కళ్లలో స్పష్టత పెరుగుతుంది, రోజు మొదలైందన్న సిగ్నల్ శరీరానికి వెళ్లినట్టు అనిపిస్తుంది. అదే కెఫైన్ ఇచ్చే చిన్న బూస్ట్, ఎల్-థియానిన్ ఇచ్చే కాల్మ్ ఫోకస్ కలిసి ఆ ఉదయం మూడ్‌ను సెట్ చేస్తాయి. అందుకే చాలామందికి టీ లేకుండా రోజు స్టార్ట్ అయినట్టే అనిపించదు.

- Advertisement -

ప్రపంచంలో ఎక్కువ మంది తాగే పానీయాలలో టీ ముందుంటుంది. పాలు కలిపిన టీ సాధారణంగా ఎక్కువగా తాగినా, ఇప్పుడు బ్లాక్ టీ, గ్రీన్ టీపై అవగాహన పెరిగింది. ఈ రెండూ ఒకే టీ ఆకుల నుంచి తయారవుతాయి కానీ ప్రాసెసింగ్ విధానం వేరుగా ఉంటుంది. గ్రీన్ టీ తక్కువగా ఆక్సిడైజ్ అవుతుంది, బ్లాక్ టీ పూర్తిగా ఆక్సిడైజ్ అవుతుంది. అందుకే రుచి, రంగు, కెఫైన్ స్థాయిలో కొంత తేడా కనిపిస్తుంది.

Read Also: White Guava vs Red Guava: జామకాయల్లో రంగును బట్టి మారే పోషకాలు.. మీకు ఏది అవసరమో తెలుసుకోండి

హెల్త్ పరంగా చూస్తే రెండింటిలోనూ ఫ్లేవనాయిడ్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బులు, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్ నుంచి రక్షణ కలిగించడంలో పాత్ర వహిస్తాయి. రోజుకు 2 కప్పులు లేదా అంతకంటే ఎక్కువ బ్లాక్ టీ తాగేవారిలో హార్ట్ డిసీజ్ రిస్క్ తక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు గ్రీన్ టీ హై బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో, మెదడు పనితీరు మెరుగుపరచడంలో, హెల్దీ ఏజింగ్‌కు మద్దతు ఇవ్వడంలో ప్రత్యేక ప్రయోజనం కలిగిస్తుంది. గ్రీన్ టీ లో ఉన్న ఎపిగాలోకాటెకిన్-3-గాలేట్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్, లివర్ డ్యామేజ్ వంటి సమస్యల నుంచి రక్షణ ఇవ్వడంలో సహాయపడుతుంది.

కెఫైన్ పరంగా బ్లాక్ టీ లో సుమారు 50 మిల్లీగ్రామ్స్ వరకు ఉండవచ్చు, గ్రీన్ టీ లో సుమారు 30 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అయితే ఇది బ్రాండ్, తయారీ విధానం ఆధారంగా మారవచ్చు. రెండు టీలు కూడా కాఫీతో పోలిస్తే తక్కువ కెఫైన్ కలిగి ఉంటాయి. రెండింటిలోనూ ఎల్-థియానిన్ ఉండటం వల్ల అలర్ట్‌నెస్ పెరుగుతుంది కానీ ఆందోళన ఎక్కువగా రాకుండా సహాయపడుతుంది.

మొత్తానికి “ఏది ఎక్కువ హెల్తీ?” అన్న ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. మీ రుచి, మీ ఆరోగ్య అవసరాల ఆధారంగా ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే రోజుకు 3 నుంచి 4 కప్పుల వరకు మాత్రమే తాగడం మంచిది. ఎక్కువైతే ఆందోళన, నిద్రలేమి, గుండె వేగంగా కొట్టుకోవడం, కడుపు సమస్యలు వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. పరిమితిలో తాగితే బ్లాక్ టీ అయినా గ్రీన్ టీ అయినా మీ రోజు ఎనర్జీగా, హెల్త్ ఫోకస్‌తో సాగేందుకు సహాయపడతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News