Winter Immunity Drinks: చలికాలం వచ్చిందంటే చాలా మంది దగ్గు, జలుబుతో బాధపడుతుంటారు. ఈ అనారోగ్యానికి ప్రధాన కారణం బలహీనమైన రోగనిరోధక శక్తి. మన రోగనిరోధక శక్తి బలహీనమైనప్పుడు, శరీరం కాలానుగుణ వ్యాధులకు ఎక్కువగా గురవుతుంది. కాబట్టి, దీన్ని అధిగమించడానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా అవసరం. అందువల్ల, ఈ చలికాలంలో దగ్గు, జలుబును నివారించడానికి అలాగే శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే 5 పానీయాల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
అల్లం, నిమ్మకాయ టీ: ఈ శీతాకాలంలో శరీరాన్ని అనారోగ్యాల నుండి దూరంగా ఉంచడానికి అల్లం, నిమ్మకాయ టీ తాగడం ఎంతో మంచిది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని తాయారు చేయడానికి నీరు తీసుకొని, అందులో అల్లం వేసి బాగా మరిగించాలి. అనంతరం ఈ మిశ్రమానికి నిమ్మరసం జోడించాలి.
also read:Water Consumption: రోజుకు 3 లీటర్ల నీరు 30 రోజుల పాటు తాగితే ఏమి జరుగుతుంది?
పసుపు పాలు: ఈ సీజన్ లో పసుపు పాలు తాగడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆహార కలయికలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
దాల్చిన చెక్క, తేనె టీ: కొన్ని వంటగది సుగంధ ద్రవ్యాలు దగ్గు, జలుబులను నయం చేసే శక్తిని కలిగి ఉంటాయి. అందులో దాల్చిన చెక్క ఒకటి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఈ డ్రింక్ కోసం నీటిలో దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. ఆపై తేనె వేసి బాగా మిక్స్ చేసి తాగాలి. ఇది దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. శరీరాన్ని తాజాగా ఉంచుతుంది.
తులసి, అల్లం టీ: శరీరాన్ని వెచ్చగా, శక్తివంతంగా ఉంచడానికి తులసి, అల్లం తో తయారు చేసిన టీ తాగవచ్చు. తులసి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. దీన్ని చేయడానికి నీటిలో అల్లం, తులసి ఆకులను వేసి బాగా మరిగించాలి. అనంతరం దీనిని వడకట్టి తాగాలి. ఇది జలుబు, ఫ్లూ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
also read:Upcoming Cars: కొత్త కారు కొనాలా..? డిసెంబర్, జనవరిలో లాంచ్ కానున్న 5 అద్భుతమైన కార్లు ఇవే..!
పసుపు, నల్ల మిరియాలు కషాయం: రోగనిరోధక శక్తిని పెంచడానికి పసుపు, నల్ల మిరియాలు కషాయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ డ్రింక్ కోసం వేడి నీరు లేదా పాలలో పసుపు, కొద్దిగా నల్ల మిరియాలు వేసి బాగా మరిగించాలి. పసుపు, నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

