Tuesday, July 2, 2024
Homeహెల్త్Botox: వెంట్రుకలకు బొటాక్స్!

Botox: వెంట్రుకలకు బొటాక్స్!

స్కిన్ బొటాక్స్ ప్రొసీజర్ గురించి చాలామంది వినే ఉంటారు. ఇది ముఖం అందంగా, యంగ్ గా కనిపించేలా చేసే ట్రీట్మెంట్. మరి హెయిర్ బొటాక్స్ గురించి మీకు తెలుసా? శిరోజాల పరిరక్షణలో ఇది ఎలా తోడ్పడుతుందో ఐడియా ఉందా? బొటొలినిమ్ టాక్సిన్ నే బొటాక్స్ అంటారు. ముఖంపై ఏర్పడ్డ ముడతలు, ఫైన్ లైన్స్ ను పోగొట్టే ట్రీట్మెంట్ ప్రక్రియగా దీనికి మంచి పేరుంది. అయితే హెయిర్ బొటాక్స్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన ప్రొసీజర్. హెయిర్ బొటాక్స్ లో బొటొలినిమ్ టాక్సిన్ ను అస్సలు ఉపయోగించరు. ఇది దానిలా ఇంజక్టబుల్ ప్రొసీజర్ కూడా కాదు.

- Advertisement -

హెయిర్ బొటాక్స్ లో బొటాక్స్ అన్నదానిని ఒక వాడుక పదంగా మాత్రమే ఉపయోగిస్తున్నారు. దెబ్బతిన్న రింగులు తిరిగిన శిరోజాలను బాగుచేసే డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ ఇది. బలహీనంగా, చిట్లిపోయినట్టు ఉన్న జుట్టు కొసళ్లను బాగుచేయడానికి కూడా ఈ ట్రీట్మెంట్ చేస్తారు. రింగుల జుట్టు, వెంట్రుకల కొసళ్లు దెబ్బతినడానికి చాలా కారణాలు ఉంటాయి. తరచూ వెంట్రుకలకు కెమికల్ ట్రీట్మెంట్ చేయడం ఇందుకు ఒక కారణం అయితే, హీటింగ్ టూల్స్ ను వెంట్రుకలపై ఎక్కువగా వాడడం మరొక ప్రధాన కారణం. ఈ ట్రీట్మెంట్ విధానం వెంట్రుకలను మెరిసేలా, మ్రుదువుగా ఉండేలా చేస్తుంది కాబట్టి దీన్ని హెయిర్ బొటాక్స్ అని పిలుస్తున్నారు. రసాయనాలు లేని స్ట్రైటెనింగ్ పదార్థాలతో మాత్రమే వెంట్రుకలను ఇందులో స్ట్రైట్ చేస్తారు. ఇది డీప్ కండిషనింగ్ ప్రొసీజర్. ఇది వెంట్రుకలు పీచులా ఉండకుండా చేస్తుంది. అంతేకాదు జుట్టు చిట్లకుండా పరిరక్షిస్తుంది. వెంట్రుకలను మెరిసేలా చేస్తుంది.

ఈ థెరపీ హెయిర్ లోని కెరటిన్ పొరను మ్రుదువుగా చేయడంతోపాటు హైడ్రేటింగ్ ఏజెంట్ అయిన కేవియర్ ఆయిల్ తో జుట్టు నునుపుగా తయారయ్యేలా చేస్తుంది. బి5 లేదా విటమిన్ మాయిశ్చరైజర్స్ జుట్టు పాయలకు కావలసిన హైడ్రేషన్ అందించడంతో పాటు వెంట్రుకలు డల్ గా లేకుండా చేస్తుంది. ఆరోగ్యకరమైన ప్రొటీన్లతో నిండిన కొల్లెజెన్ కాంప్లక్స్ వెంట్రులను ద్రుఢంగా ఉండేలా చేస్తుంది. వెంట్రుకలను నిగ నిగలాడేలా చేస్తుంది. మాడుపై చెమట బాగా కారడం , జుట్టుకు ఎక్కువ షాంపు వాడాల్సి రావడం, చుండ్రు వంటి సమస్యలను సర్వసాధారణంగా ఇంజక్షన్ల ప్రొసీజర్ ద్వారా నివారిస్తారు. అయితే ఇలాంటి హెయిర్ ప్రొసీజర్లకు, హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంటుకు తేడా ఉంది.

హెయిర్ బొటాక్స్ చికిత్సలో రకరకాల ఆయిల్స్ వాడడం, కండిషనింగ్ ఏజెంట్సును ఉపయోగించడం ద్వారా వెంట్రుకల్లో మాయిశ్చరైజర్ ను పునరుద్ధరిస్తారు. పీచులా ఉన్న జుట్టును మ్రుదువుగా, నిగ నిగ మెరిసేలా చేస్తారు. హెయిర్ బొటాక్స్ తో హెయిర్ స్ట్రైటనింగ్ ప్రయోజనాలను కొన్నింటిని పొందుతాం. జుట్టు ఒత్తుగా ఉండేలా కూడా చేస్తారు. అయితే హెయిర్ బొటాక్స్ చేసుకున్న తర్వాత దాని ప్రయోజనాలు దీర్ఘకాలం పొందడానికి వెంట్రుకల సంరక్షణలో కొన్ని టిప్స్ ను తప్పనిసరిగా పాటించాలి. జుట్టుకు పిహెచ్ బ్యాలెన్స్ షాంపు, కండిషనర్లను వాడాలి. ఈ డీప్ కండిషనింగ్ థెరపీ అన్ని రకాల వెంట్రుకలకూ సరిపడుతుందని శిరోజాల నిపుణులు చెప్తున్నారు. అయితే హెయిర్ బొటాక్స్ చేయించుకోబోయే ముందు తప్పనిసరిగా చర్మనిపుణులను సంప్రదించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఎలర్జీల బారిన పడరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News