Homeహెల్త్Oncology : మగువలపై 'మహమ్మారి' పంజా: రొమ్ము క్యాన్సర్‌కు కారణాలేమిటి?

Oncology : మగువలపై ‘మహమ్మారి’ పంజా: రొమ్ము క్యాన్సర్‌కు కారణాలేమిటి?

breast cancer risk factors in women : నేటి ఉరుకుల పరుగుల జీవనంలో మహిళల ఆరోగ్యం పెను సవాలుగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న రొమ్ము క్యాన్సర్ మన దేశంలో ఏటా సుమారు 2.4 లక్షల మందిని బలితీసుకుంటోందన్నది చేదు నిజం. “ప్రతి ఒక్కరి కథ ప్రత్యేకం” అంటూ అవగాహన కల్పిస్తున్నప్పటికీ బాధితుల సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

రొమ్ము క్యాన్సర్‌కు దారితీసే ముఖ్య కారణాలు: పరోక్ష ధూమపానం (Secondhand Smoking): ఇతరులు వదిలిన సిగరెట్ పొగను పీల్చడం వల్ల శరీరంలో ‘డీఎన్‌ఏ అడక్ట్స్‌’ ఏర్పడి, జన్యు పరివర్తనలకు (Gene Mutations) దారితీసి క్యాన్సర్ కారకంగా మారుతుంది.

అధిక బరువు & ఆహారపు అలవాట్లు: ప్రత్యేకించి మెనోపాజ్ తర్వాత శరీరంలో కొవ్వు కణజాలం ఈస్ట్రోజన్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. అలాగే అధిక ఉష్ణోగ్రతల్లో వేయించిన మాంసాహారంలోని ‘హెటెరోసైక్లిక్‌ అమైన్లు’ క్యాన్సర్‌కు ఆజ్యం పోస్తాయి.

బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ & డెన్స్ బ్రెస్ట్: గర్భనిరోధక మాత్రల దీర్ఘకాలిక వినియోగం, రొమ్ముల్లో గ్రంథి కణజాలం ఎక్కువగా ఉండే ‘డెన్స్ బ్రెస్ట్’ సమస్య ముప్పును మరింత పెంచుతాయి.

అపోహలు వీడండి – వాస్తవాలు తెలుసుకోండి:
కుటుంబ చరిత్ర లేకున్నా: సుమారు 80 శాతం కేసుల్లో కుటుంబ చరిత్ర లేకపోయినా ఈ క్యాన్సర్ బయటపడుతోంది.

గడ్డలు లేకున్నా ముప్పే: కేవలం గడ్డలే కాకుండా చర్మం లోపలికి నొక్కుకుపోవడం, చనుమొన ఆకృతి మారడం వంటివి కూడా తీవ్ర సంకేతాలే.

హార్మోన్ల ప్రభావం: 13 ఏళ్ల లోపే రజస్వల కావడం లేదా ఆలస్యంగా మెనోపాజ్ రావడం వల్ల ఈస్ట్రోజెన్ ప్రభావం ఎక్కువై రిస్క్ పెరుగుతుంది. అలాగే ఏడాది పాటు తల్లిపాలు ఇవ్వని వారిలోనూ ఈ ముప్పు ఎక్కువ.

ఎడమ రొమ్ములోనే అధికం: నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల ప్రకారం సుమారు 50.8% మందిలో ఎడమ వైపే క్యాన్సర్ నిర్ధారణ అవుతోంది.  ప్రాథమిక దశలోనే క్రమం తప్పకుండా స్వీయ పరీక్షలు, మమోగ్రామ్‌ చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడమే ఈ ముప్పు నుంచి తప్పించుకునే అసలైన రక్షాకవచం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News