Tuesday, September 17, 2024
Homeహెల్త్Burn Belly fat: ఇది తాగితే పొట్ట చుట్టూ కొవ్వు మాయం

Burn Belly fat: ఇది తాగితే పొట్ట చుట్టూ కొవ్వు మాయం

దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు

తేనె, దాల్చినచెక్క నీళ్ల మిశ్రమం బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది.  అంతేకాదు పొట్ట దగ్గర చేరిన కొవ్వును కరిగించడంలో కూడా ఈ వంటింటి చిట్కా ఎంతగానో పనిచేస్తుంది. నిత్యం ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. ముఖ్యంగా తేనె శరీర బరువును తగ్గించడంలో, పొట్ట చుట్టూ పేరుకున్నకొవ్వును కరిగించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. తేనెకి ఆకలిని తగ్గించే గుణం ఉందని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. అంతేకాదు బరువును తగ్గించే పలు యాంటాక్సిడెంట్లు, పోషకాలు తేనెలో ఉన్నాయని పోషకాహారనిపుణులు చెప్తున్నారు.  

- Advertisement -

గోరువెచ్చటి నీళ్లల్లో కొద్దిగా తేనె వేసి కలిపి ఆ నీళ్లను రోజూ ఉదయమే తాగితే శరీర బరువు తగ్గుతుందని మన పూర్వికుల నుంచి వస్తున్న ఆరోగ్య కిటుకు. అలాగే దాల్చిన చెక్క వల్ల కూడా బరువు తగ్గుతాం. దాల్చిన చెక్కనీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అంతేకాదు శరీరంలో పేరుకుని ఉన్న కొవ్వును కరిగించడంలో కూడా ఇది బాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క నీళ్లు కొవ్వును కరిగించడంలో ఎంతో బాగా పనిచేస్తుందని అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. తేనె, దాల్చిన చెక్క రెండు కలిపిన మిశ్రమం అయితే కొవ్వును కరిగించడంలో మరింత అద్భుతంగా పనిచేస్తుందిట. ఇది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడమే కాకుండా శరీరాక్రుతి మంచి ఫిట్ నెస్ తో ఉండేలా మలుస్తుందిట.

మరి తేనె, దాల్చిన చెక్క నీళ్ల మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలని అడుగుతున్నారా…తేనె, దాల్చిన చెక్క నీటి మిశ్రమాన్ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. ఒక కప్పు నీళ్లను తీసుకుని అందులో దాల్చినచెక్క చిన్న ముక్కను వేయాలి. లేదా అర టీస్పూను దాల్చినచెక్క పొడిని అందులో వేసి ఆ నీళ్లను మరగనివ్వాలి . తర్వాత స్టవ్ నుంచి దించి ఆ నీళ్లను బాగా చల్లారినివ్వాలి. తర్వాత అందులో ఒక టీస్పూను తేనెను వేసి బాగా కలపాలి. దీంట్లో కొంత నిమ్మరసం కూడా పిండి ఆ మిశ్రమాన్ని తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు బాగా కరుగుతుంది. ఆకలి అనిపించినపుడు, వర్కవుట్లు చేసేముందు లేదా పడుకోబోయే ముందు గోరువెచ్చటి నీళ్లుతాగితే కూడా ఎంతో మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News