మజ్జిగ వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు చెప్పాలంటే పెద్ద జాబితానే ఉంటుంది. ఇది శరీరానికి సహజసిద్ధమైన కూలెంట్ గా పనిచేస్తుంది. మజ్జిగ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మన శరీర ఎనర్జీని సైతం పెంచుతుంది. ఎసిడిటీ తగ్గుతుంది. కొలస్ట్రాల్ ప్రమాణాలను కూడా మజ్జిగ బాగా తగ్గిస్తుంది.
అధిక రక్తపోటును నివారిస్తుంది. 100 ఎంఎల్ మజ్జిగ తాగితే 40 కాలరీల ఎనర్జీ వస్తుంది. పాలకన్నా ఇందులో ఫ్యాట్ తక్కువ ఉంటుంది. కాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ప్రొటీన్, కాల్షియంలు కూడా ఇందులో ఎక్కువే. ఇందులో సోడియం, పొటాషియంలతో పాటు బోలెడు విటమిన్లు కూడా ఉన్నాయి.
ఇంకా మజ్జిగలో ప్రొబయొటిక్స్ ఎక్కువ. వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంతో పాటు జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. అలాగే ఒక గ్లాసు మజ్జిగ రోజుకు అవసరమయ్యే 28 శాతం కాల్షియాన్ని అందిస్తుంది. మజ్జిగలో బి12 ఉంది.
సాధారణంగా మెనోపాజ్ లో ఉన్న మహిళలు హాట్ ఫ్లాషెస్ తో బాధపడుతుంటారు. వీళ్లు రోజుకు ఒక గ్లాసుడు మజ్జిగ తాగితే ఆ బాధ నుంచి సాంత్వన పొందుతారు. మజ్జిగ శరీరానికి కావలసినంత హైడ్రేషన్ అందిస్తుంది. ఇందులో 90 శాతం నీళ్లు, పొటాషియం లాంటి ఎలక్ట్రలైట్లు బాగా ఉంటాయి. శరీరంలోని నీటి సమతుల్యతను మజ్జిగ పరిరక్షించడమే కాదు శరీరం డీహైడ్రేషన్ కాకుండా సహాయపడుతుంది కూడా. మజ్జిగలో ఆరోగ్యకరమైన బాక్టీరియా, లాక్టిక్ యాసిడ్లు ఉంటాయి.
ఇవి జీవక్రియకు ఎంతగానో తోడ్పడతాయి. బవుల్ మూవ్మెంట్స్ ను క్రమబద్ధీకరించడంతో పాటు ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ (ఐబిఎస్) ను తగ్గిస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాదు పొట్టకు సంబంధించిన పలు ఇన్ఫెక్షన్లు, లాక్టోస్ ఇంటాలరెన్స్, పెద్ద పేగు కాన్సర్ పాల బడకుండా కూడా సంరక్షిస్తుంది.
పైగా మజ్జిగ తాగడం వల్ల రోజంతా ఎంతో ఎనర్జీగా ఉంటారు. ఇందుకు కారణం మజ్జిగలో ఉండే రిబోఫ్లావిన్. ఇది విటమిన్ బి. శరీరానికి సంబంధించిన ఎనర్జీ ఉత్పత్తి వ్యవస్థలకు ఇది చాలా ముఖ్యమైంది కూడా. శరీరంలోని ఎమినోయాసిడ్లను మజ్జిగ నియంత్రిస్తుంది. ఎమినోయాసిడ్లకు ఇది కారణం. మజ్జిగలో కాల్షియం ఎక్కువగా ఉంటుందని ముందే చెప్పుకున్నాం.
100 ఎంఎల్ మజ్జిగలో 116 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఎముకలను బలంగా ఉంచే కాల్షియం కూడా మజ్జిగలో ఎక్కువే. కాల్షియం శరీరంలోని ఎముకలను, దంతాలను సురక్షితంగా ఉంచుతుంది. మజ్జిగ నిత్యం తీసుకోవడం వల్ల ఎముకలను అరిగేట్టు చేసే ఆస్టియోపొరాసిస్ వంటి జబ్బుల బారిన పడం. ఆయిల్, మసాలా ఫుడ్స్ తిన్నప్పుడు తీవ్రమైన ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటాం. ఆ ఎసిడిటీని మజ్జిగ బాగా తగ్గిస్తుంది. దీంతో యాసిడ్ రిఫ్లక్స్, హార్ట్ బర్న్ వంటి వాటి బారిన పడము.
ఒక గ్లాసుడు మజ్జిగలో మిరియాల పొడి, కొత్తిమీర వేసి తాగితే ఎసిడిటీ లక్షణాలు పోతాయి. మజ్జిగలోని లాక్టిక్ యాసిడ్ ఈ సమస్యను బాగా తగ్గిస్తుంది. ఎసిడిటీ నుంచి ఎంతో సాంత్వననిస్తుంది. నిత్యం మజ్జిగ తాగడం వల్ల కొలెస్ట్రాల్ ప్రమాణాలతో పాటు ట్రైగ్లిజరైడ్స్ నివారిస్తుంది. అలా గుండె ఆరోగ్యం బాగుండేట్టు కూడా మజ్జిగ చూస్తుంది. నిత్యం మజ్జిగ నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా బాగుంటుంది.
అంతేకాదు రకరకాల ఇన్ఫెక్లన్ల బారిన పడకుండా రక్షణ కవచంలా మజ్జిగ వ్యవహరిస్తుంది. మజ్జిగలోని ప్రొబయాటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగలోని లాక్టిక్ యాసిడ్ చర్మానికి ఎంతో మంచిది. మేని ఛాయను మెరిసేలా చేసే గుణం మజ్జిగలో ఉంది. మజ్జిగ శరీరంలోని మలినాలను బయటకు పంపేస్తుంది. స్కిన్ క్లీన్సర్ గా, టోనర్ గా కూడా మజ్జిగ పనిచేస్తుంది. అంతేకాదు ట్యాన్, నల్ల మచ్చలు, యాక్నేలకు కూడా మజ్జిగ చెక్ పెడుతుంది. మజ్జిగ చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ ఇవ్వడంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలా వయసులో వృద్ధాప్యపు జాడలు కనిపించకుండా తోడ్పడుతుంది. మజ్జిగలో డి విటమిన్ తో బాటు బికాంప్లెక్స్ విటమిన్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముందే చెప్పినట్టు మజ్జిగలో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.
కాలరీలు, ఫ్యాట్ మటుకు చాలా తక్కువగా ఉంటాయి. మజ్జిగ తాగడం వల్ల కడుపు ఫుల్ గా ఉండి జంక్ ఫుడ్ మీదకు ఆలోచనలు పోవు. పైగా బరువు తగ్గాలనుకునే వారికి మజ్జిగ మంచి డ్రింకు. మజ్జిగ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. మజ్జిగలోని రిబొఫ్లావిన్ మనం తిన్న ఆహారాన్ని ఎనర్జీగా మారుస్తుంది. హార్మోన్ల పరంగా కూడా రిబొఫ్లావిన్ ఎంతగానో సహాయపడుతుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాదు రిబొఫ్లావిన్ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది కూడా.