బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. వెయిట్ లాస్ డైట్, వ్యాయామాలు వంటివి అనుసరిస్తుంటాం. అయితే బరువు తగ్గించడంలో కెఫైన్ కూడా శక్తివంతంగా పనిచేస్తుందని పలువురు నిపుణులు చెప్తున్నారు. బరువు కరిగించడంలో కెఫైన్ బాగా పనిచేస్తుంది. టీ, కాఫీలలో కెఫైన్ ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. ఎనర్జీ డ్రింకుల్లో కూడా ఇది ఉంటుంది. ఆకలిని తగ్గించే సప్లిమెంటుగా ఇటీవల వెయిట్ లాస్ రెజీమ్ లో కెఫైన్ని సూచిస్తున్నారు. కెఫైన్ థెర్మోజెనిక్ కాంపౌండ్. ఇది ఫ్యాట్, కాలరీలను కరిగించాలని శరీరానికి సూచించే మూలకం. కెఫైన్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలోని కాలరీలను, ఫ్యాట్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. తొందరగా ఆకలి వేయదు. ఇది కేవలం కొన్ని కాలరీలను మాత్రమే శరీరంలో ఫ్యాట్ గా నిల్వచేస్తుంది. కెఫైన్ మెదడులోని కణాలను ఉత్తేజితం చేసి శారీరకంగా యాక్టివ్ గా ఉంచుతుంది. జీవక్రియను పెంచడం ద్వారా ఎక్కువ ప్రమాణంలో కాలరీలు కరిగేట్టు చేస్తుంది. దీనివల్ల శరీరానికి అలసట అనిపించదు.
వర్కవుట్లు చేసేటప్పుడు ఫ్యాట్ కరిగేలా చేస్తుంది. ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచడమే కాకుండా మూడ్ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది. పని పరంగా ఏకాగ్రతను కూడా పెంచుతుంది. వ్యాయామాలు చేసిన తర్వాత తలెత్తే నొప్పులు, బాధల నుంచి సాంత్వన నిస్తుంది. వ్యాయామాలు చేయడానికి కావలసింత ఎనర్జీని కూడా ఇస్తుంది. శరీరాన్ని ఆరోగ్యకరమైన బరువుతో, ఆక్రుతితో ఉంచేలా కెఫైన్ ఎంత తోడ్పడుతుందో, దాన్ని అతిగా తీసుకుంటే వచ్చే ఇబ్బందులు కూడా అంతే తీవ్రంగా ఉంటాయని ఫిట్నెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిమిత పరిమాణంలోనే టీ, కాఫీలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు అతిగా కెఫైన్ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. డీహైడ్రేషన్ సమస్యను కూడా ఎదుర్కొంటారు. దీంతో జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఎక్కువ కెఫైన్ డ్రింకులు తీసుకోవడం వల్ల ఎపినెఫ్రైన్ వంటి స్ట్రెస్ హార్మోన్లు పెరిగే ప్రమాదం ఉంది. మీరు కాఫీ లవర్ అయితే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవడం ఇంకా బెస్టు అంటున్నారు.
నిత్యం వేడినీళ్ల కాఫీని (చికోరీ లేకుండా) ఒక కప్పు తీసుకుంటే మంచిది. లేదా రోజుకు రెండు కప్పులు గ్రీన్ టీ తాగితే మంచిది. లేదా డార్కు చాక్లెట్ చిన్న ముక్కను తినొచ్చు. ఇవేవీ కాకపోతే ఒక షాట్ ఎక్స్ ప్రెసో కాఫీని తాగాలి. ఇవేవో కాకపోతే చక్కెర లేకుండా బ్లాక్ టీ తాగొచ్చు. కెఫైన్ ఉన్న ఐటమ్స్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆకలిని తగ్గించే మందుల్లో కెఫైన్ , ప్రిజర్వేటివ్స్ బాగా ఉంటాయి. ఎనర్జీ డ్రింకులకు దూరంగా ఉండాలి. వీటిల్లో షుగర్ తో పాటు కెఫైన్ ఉంటుంది. కోలాలు, సోడాల్లో కూడా కెఫైన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండాలి. కెఫైన్ మంచిదే కానీ మితం దాటకూడదు. అలాగే వైద్యుల సూచనలతోనే కెఫీన్ ఎంత తీసుకోవాలో అంత తీసుకోవడం మంచిదని కూడా మరొవొద్దు.