Saturday, November 15, 2025
Homeహెల్త్Cancer Health Tips: క్యాన్సర్‌ వ్యాధికి బాదం గింజలతో చెక్‌ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసా?

Cancer Health Tips: క్యాన్సర్‌ వ్యాధికి బాదం గింజలతో చెక్‌ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసా?

Cancer Cure With Almonds: ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చిన్న వయస్సులోనూ ఇది అటాక్‌ చేస్తోంది. అందుకే, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు చెక్‌ పెట్టేందుకు లక్షలు వెచ్చిస్తుంటారు. అయితే, ఆర్థికంగా స్థోమత ఉన్నవారు చికిత్సతో బయటపడుతున్నప్పటికీ పేదవారు మాత్రం చికిత్స చేయించుకోలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే, చికిత్స కంటే నివారణే మార్గమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ప్రాణాంతక క్యాన్సర్‌ ధరి చేరకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. క్యాన్సర్‌ ధరి చేరకూడదంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందని సలహా ఇస్తున్నారు. క్యాన్సర్‌ను నిరోధించగలిగే ఔషధ గుణాలున్న ఆహారం మన చుట్టూనే ఉందని నిపుణులు చెబుతున్నారు. అటువంటి అద్భుతమైన గుణాలున్న ఒక ఆహారం బాదం గింజలు. బాదం గింజలలో క్యాన్సర్‌ను నిరోధించగలిగే శక్తివంతమైన పోషక పదార్థం B17 పుష్కలంగా లభిస్తుంది. మన రోజువారీ ఆహారంలో ఈ బాదం గింజలను భాగం చేసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ ఎటాక్‌ అయినప్పటికీ దాని తీవ్రతను తగ్గించుకోవచ్చు. అలాంటి దేశ దేశవాళీ బాదం గింజల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/technology-news/iphone-16-pro-offer-and-features/

ఎలాంటి బాదం గింజలు తీసుకోవాలి?

అయితే, మార్కెట్లో చాలా రకాల బాదం గింజలు దొరుకుతున్నాయి. క్వాలిటీని బట్టి ఆయా ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. క్యాన్సర్‌కు చెక్‌ పెట్టాలంటే మనం తీసుకునే బాధంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో లభించే ఏదో ఒక బాదం గింజ తిజకూడదని, దుకాణాలలో దొరికేవి క్లీన్ మాడిఫైడ్ ఆర్గానిజం రకానికి చెందినవి తినకూడదని చెబుతున్నారు. పూర్వకాలం నుంచి మన దేశంలో సహజంగా పెరిగే దేశవాళీ బాదం గింజలు మాత్రమే తినాలని సలహా ఇస్తున్నారు. ఈ దేశవాళీ బాదం గింజలు బారుగా, సన్నగా ఉంటాయి. ఇవి సాధారణంగా చెట్లకు కాసి, పగలగొట్టిన తర్వాత మొదట్లో కొంచెం లావుగా ఉండి.. చివర సన్నగా ఉంటాయి. ఈ దేశవాళీ బాదం గింజలను రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. ఉదయం ఐదు (5), సాయంత్రం నాలుగు (4) బాదం గింజలను నానబెట్టి తింటే.. శరీరానికి B17 పుష్కలంగా అందుతుంది. ఈ B17 పోషకానికి క్యాన్సర్‌ను అదుపు చేసే ఔషధ లక్షణం ఉందని.. అలాగే వ్యాధి రాకుండా నిరోధించగలిగే గుణం కూడా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. క్యాన్సర్‌ను నివారించడంలో ఈ దేశవాళీ బాదం గింజలు అద్భుతమైన పాత్ర పోషిస్తాయని గుర్తించుకోవాలి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad