Saturday, November 15, 2025
Homeహెల్త్Health Tips: మీ బీపీ కంట్రోల్‌ కావడం లేదా..అయితే ఓ చెంచాడు యాలకుల పొడి చాలు!

Health Tips: మీ బీపీ కంట్రోల్‌ కావడం లేదా..అయితే ఓ చెంచాడు యాలకుల పొడి చాలు!

Cardamom VS Bp: హై బ్లడ్ ప్రెజర్ అంటేనే ఒక ప్రమాదకర స్థితి. దీన్ని కంట్రోల్ చేయడంలో మెడిసిన్స్ తప్పనిసరిగా వాడాలి. కానీ, వైద్యుడి సలహాతో కొన్ని సహజమైన మార్గాలు పాటిస్తే మెడిసిన్‌ ప్రభావం మరింత వేగంగా కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యాలకులు బీపీ తగ్గించడంలో ఉపయోగపడతాయని తాజా పరిశోధనలు వెల్లడించాయి. మనం సాధారణంగా వంటల్లో వాసన, రుచికి యాలకులు వాడుతూ ఉంటాం. కానీ ఈ చిన్న సుగంధ ద్రవ్యానికి రక్తపోటును తగ్గించే గుణం ఉందని శాస్త్రపరమైన అధ్యయనాలు చెబుతున్నాయి.

- Advertisement -

రక్త ప్రవాహాన్ని..

ఒక క్లినికల్ ట్రయల్‌లో హై బీపీ ఉన్నవారికి 12 వారాల పాటు ప్రతి రోజు మూడు గ్రాముల యాలకుల పొడి ఇచ్చి పరిశీలించారు. ఫలితాల్లో, యాలకులు తీసుకున్న వారిలో బీపీ స్థాయిలు క్రమంగా సాధారణ స్థితికి చేరాయని గమనించారు. ఇది యాలకులు ధమనుల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంతో బీపీ స్థిరపడటానికి సహాయపడతాయని సూచిస్తోంది.

యాంటీ ఆక్సిడెంట్స్…

యాలకులు నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతాయి. ఇది రక్త నాళాలను సడలించి రక్త సరఫరాను సులభం చేస్తుంది. ఈ ప్రక్రియలో గుండె మీద ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అలాగే శరీరంలో ఉండే ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా యాలకులు తోడ్పడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీర కణాలు హాని చెందకుండా కాపాడబడతాయి.

బీపీ పెరగడానికి…

యాలకులు రక్తంలో నీటి పరిమాణాన్ని క్రమం తప్పకుండా కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. బీపీ పెరగడానికి మరో కారణం శరీరంలో నీరు అధికంగా నిల్వ కావడం. యాలకులు డయూరెటిక్ లక్షణాలతో ఈ సమస్యను నివారిస్తాయి. ఫలితంగా గుండె పని భారాన్ని తగ్గించడానికి ఇవి ఉపకరిస్తాయి.

సరైన ఉపయోగం కోసం రోజూ మూడు గ్రాముల యాలకుల పొడిని మూడు సార్లు విభజించి తీసుకోవడం ఉత్తమం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా తీసుకోవచ్చు. పొడిని తాజాగా దంచి టీ, పాలు, స్మూతీలు, జ్యూస్, కర్రెంట్ కూరల్లో కూడా కలిపి వాడొచ్చు. యాలకులు నేరుగా నమిలి తిన్నా మంచిదే. ఇలా వాడితే నోటి దుర్వాసనకు కూడా ఇది పరిష్కారం అవుతుంది.

యాలకులు వాడడం…

కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా రోజూ మూడు గ్రాములకంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. బీపీ మందులు లేదా బ్లడ్ థిన్నర్స్ వాడేవారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే యాలకులు వాడడం సురక్షితం. తక్కువ నాణ్యత కలిగిన యాలకులు వాడకూడదు. హై క్వాలిటీ యాలకులు మాత్రమే వాడటం ఆరోగ్యానికి మంచిది.

Also Read:https://teluguprabha.net/lifestyle/six-natural-foods-that-boost-heart-health-effectively/

ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మెడికేషన్ వదిలేసి పూర్తిగా యాలకుల మీద ఆధారపడకూడదు. ఇవి కేవలం సహజంగా సపోర్ట్ చేసే చిట్కాలు మాత్రమే. ప్రతీసారి వైద్యుల సలహా తీసుకోవడం చాలా అవసరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad