Sunday, November 16, 2025
Homeహెల్త్Alzheimers : పిల్లులు అల్జీమర్స్ వ్యాధి రహస్యాలను ఛేదించడంలో కీలక పాత్ర పోషిస్తాయా?

Alzheimers : పిల్లులు అల్జీమర్స్ వ్యాధి రహస్యాలను ఛేదించడంలో కీలక పాత్ర పోషిస్తాయా?

Alzheimers : మనుషుల్లో తీవ్రమైన మతిమరుపునకు కారణమయ్యే అల్జీమర్స్ వ్యాధి చికిత్సలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ పరిశోధకులు, పెంపుడు పిల్లులు ఈ వ్యాధి రహస్యాలను ఛేదించేందుకు అద్భుతమైన మార్గం చూపగలవని కనుగొన్నారు. వయసు పైబడిన పిల్లుల్లో కనిపించే డిమెన్షియా లక్షణాలు – అరవడం, గందరగోళం, నిద్రలేమి – మనుషుల అల్జీమర్స్‌తో సమానంగా ఉన్నాయి.

- Advertisement -

పరిశోధకులు మరణించిన 25 పిల్లుల మెదళ్లను శక్తివంతమైన మైక్రోస్కోపీతో పరిశీలించారు. మనుషుల్లో అల్జీమర్స్‌కు కారణమయ్యే ‘అమైలాయిడ్-బీటా’ అనే హానికర ప్రోటీన్, పిల్లుల మెదళ్లలోనూ సినాప్సెస్ (నాడీ కణాల మధ్య సమాచార బ్రిడ్జ్‌లు) వద్ద పేరుకుపోయినట్లు తేలింది. ఈ ప్రోటీన్ కారణంగా సినాప్సెస్ దెబ్బతిని, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అంతేకాక, మెదడు సహాయక కణాలు ఆస్ట్రోసైట్లు, మైక్రోగ్లియా ఈ దెబ్బతిన్న సినాప్సెస్‌ను తొలగించే ‘సినాప్టిక్ ప్రూనింగ్’ ప్రక్రియను చేస్తున్నాయి. ఇది అభివృద్ధి దశలో మంచిదే కానీ, వ్యాధి సమయంలో నష్టాన్ని పెంచుతుంది.

ALSO READ: https://teluguprabha.net/news/Cats-alzheimers-Rearch/

ఇక ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ రాబర్ట్ మెక్‌గెచన్ మాట్లాడుతూ, “డిమెన్షియా మనుషులు, పిల్లులు, కుక్కలకు బాధాకరం. పిల్లుల్లో సహజంగా వచ్చే ఈ మార్పులు అల్జీమర్స్‌కు సరైన మోడల్. ఇది మనుషులు, పెంపుడు జంతువులకు కొత్త చికిత్సలు అందించగలదు” అన్నారు. మరో ప్రొఫెసర్ డానియెల్ గన్-మూర్ “పిల్లుల డిమెన్షియా అల్జీమర్స్‌కు సరైన మోడల్. ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad