Spleen Pain Causes and Precautions: భారత స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్.. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ కింద పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శరీరంలోని ఎడమవైపు పక్కటెముల వద్ద ఉండే ప్లీహమ్(Spleen) అవయవానికి తీవ్ర గాయం కావడంతో ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. దీంతో అతనికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం శ్రేయస్ కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. అసలు ఈ ప్లీహమ్ అంటే ఏంటి.? శరీర రక్షణలో దాని విధులు ఏంటి.? ప్లీహమ్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి.? ఇక్కడ తెలుసుకుందాం..
మనిషి శరీరంలో లింఫ్ వ్యవస్థలో ప్లీహమ్‌ది కీలక పాత్రం. ఇది రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి దోహదపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పాత ఎర్ర రక్త కణాలను తొలగిస్తుంది. ప్లీహమ్‌లోంచి రక్తం ప్రవహించే సమయంలో అందులోని బ్యాక్టీరియా, మృత కణజాలం వంటి వాటిని తినేస్తుంది. తద్వారా తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్‌లెట్లు ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. అయితే ప్లీహం సైజులో పిడికెడంతే ఉంటుంది. దీనికి కొంచెం ప్రమాదం వాటిల్లినా.. లేదా చీలిక ఏర్పడినా ఈ మొత్తం వ్యవస్థ డిస్టర్బ్ అయ్యి మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.
Also Read: https://teluguprabha.net/health-fitness/research-mou-on-link-between-diabetes-and-brain-health/
అయితే ప్లీహమ్‌కి చీలిక ఏర్పడటం ఏదైనా ప్రమాదం వల్ల వాటిల్లే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో దీని సైజు పెరిగి పెద్దదవుతుంది. ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యంగా కాలేయ వ్యాధి, కాలేయం గట్టిగా అవడం, కాలేయానికి రక్తం తీసుకెళ్లే సిరల్లో బ్లట్ క్లాట్ అవడం లాంటి సమస్యలు దీనికి దారితీయవచ్చు. మలేరియా వంటి ఇన్‌ఫెక్షన్ రోగాలు, లింఫ్ క్యాన్సర్ మూలంగానూ ప్లీహమ్ పెద్దగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్లీహమ్ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని మిగిలిన అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి.
అయితే ప్లీహమును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రత్యేకమైన నియమాలు లేనప్పటికీ, కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన అలవాట్లు దీని పనితీరుకు దోహదపడతాయి. నిత్యం సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. ఇందువల్ల మొత్తం శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది.
Also Read: https://teluguprabha.net/health-fitness/beetroot-juice-health-benefits-for-anemia-and-digestion/
విటమిన్ B-12 లోపం వల్ల ఎర్ర రక్త కణాల పనితీరు దెబ్బతిని.. ప్లీహముపై భారాన్ని పెంచుతుంది. కాబట్టి విటమిన్ B-12 అధికంగా ఉండే వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. సరిగ్గా ఉడికిన ఆహారం, పచ్చి ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రాసెస్‌డ్ ఫుడ్స్, అధిక చక్కెర, కొవ్వులను పదార్థాలను వీలైనంతగా అవాయిడ్ చేయాలి. .
వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. సింపుల్ ఎక్సర్‌సైజ్, వాకింగ్ లేదా యోగా వంటివి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచేలా చేస్తాయి. దీంతో ప్లీహమ్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. రోజుకు 7-8 గంటల నిద్రతో రోగనిరోధక వ్యవస్థ శక్తి పదిలంగా ఉంటుంది. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం ద్వారా ప్లీహముతో పాటు ఇతర అవయవాలపై ఒత్తిడి తగ్గుతుంది. ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లను మానేయాలి. వీటి ద్వారా ప్లీహముతో పాటు ఇతర అవయవాలు ఆరోగ్యంగా ఉంటూ జీవక్రియలను మెరుగుపరుస్తాయి.


