Saturday, February 22, 2025
Homeహెల్త్Diabetes: ప్రజారోగ్య పరిరక్షణకు కేంద్రం పెద్ద పీట

Diabetes: ప్రజారోగ్య పరిరక్షణకు కేంద్రం పెద్ద పీట

కేంద్ర ప్రభుత్వం చొరవ

సంక్రమించని వ్యాధులైన మధుమేహం, రక్తపోటు మరియు నోటి , రొమ్ము , గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు 30 ఏళ్లు పైబడిన వారికి నూరు శాతం కవరేజీని నిర్ధారించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇంటెన్సిఫైడ్ స్పెషల్ ఎన్‌సిడి స్క్రీనింగ్ డ్రైవ్‌ను ప్రారంభించడం పట్ల రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షాన్ని వ్యక్తం చేశారు. తద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తామన్న విషయాన్ని కేంద్రప్రభుత్వం మరోసారి రుజువు చేసిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ట్వీట్ లో మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంల ద్వారా ఇంటింటి సర్వే చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

ఇందుకోసం అవసరమైన సామగ్రిని అన్ని కేంద్రాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పారదర్శకత కోసం రియల్ టైమ్ పర్యవేక్షణ ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని మంత్రి తెలిపారు. కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు రోజువారీ సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎన్సిడి రహిత భారత్ ను రూపొందించే దిశగా అడుగులు వేస్తోందని మంత్రి సత్యకుమార్ అభివర్ణించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News