Sunday, December 8, 2024
Homeహెల్త్chamomile tea to sleep: నిద్రపుచ్చే చమోమైల్ పూల టీ

chamomile tea to sleep: నిద్రపుచ్చే చమోమైల్ పూల టీ

ఈ పూల టీ ఆరోగ్యానికి ఔషధం

రాత్రి పడుకోబోయేముందు ఒక కప్పు చమోమైల్ టీ తాగితే దానివల్ల రుచికి రుచే కాదు మంచి నిద్ర కూడా మీకు పడుతుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మీ డైట్ లో దీన్ని కూడా నిత్యం జోడిస్తే ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు సైతం అంటున్నారు. ఆరోగ్యపరమైన ప్రయోజనాలను అందించడంలో కూడా చమోమైల్ టీ ఎంతో ప్రత్యేకమైంది. ఇది ఆస్ట్రేలియాలో లభ్యమయ్యే మూలిక. ఆ మూలికా టీ సువాసనలు భారతదేశంలో ఎందరో ఇళ్లల్లో నేడు ఎక్కువగా పలకరిస్తున్నాయి. ఈ టీ ఒత్తిడిని పోగొడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. అంతేకాదు చెమోమైల్ మూలిక నుంచి తీసిన పదార్థాలను స్కిన్ కేర్ ఐటమ్స్ లోను, రకరకాల బెవరేజెస్ లో సైతం వాడుతున్నారు. ఇంతకూ చమోమైల్ టీని రాత్రి పడుకోబోయేముందే ఎందుకు తాగాలి అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది.

- Advertisement -

చమోమైల్ మొక్క పూలను బాగా ఎండబెడతారు. ఈ పూల టీలో సాంత్వననిచ్చే గుణాలు చాలా ఉన్నాయి. వేడి నీళ్లల్లో ఎండిన చమోమైల్ పూలను వేసి ఈ టీ తయారుచేస్తారు. ఈ టీ వెదజల్లే సువాసనలు మనకు ఎంతో హాయిని కలిగిస్తాయి. మనసును ఉల్లాసపరుస్తాయి. మెదడుకు ప్రశాంతతను ఇస్తాయి. అందుకే రాత్రి పడుకోబోయే ముందు వేడి వేడి చమోమైల్ టీ తాగితే మంచి నిద్ర పడుతుందని డైటీషియన్లు సైతం చెపుతున్నారు. ఈ టీ జంటిల్ రిలాక్సెంట్ మాత్రమే కాదు లాలిస్తే మనల్ని కమ్మే లాంటి అత్యంత సహజమైన నిద్రమత్తును ఈ టీతో మనం అనుభవిస్తాం. దీనివల్ల మనలోని స్ట్రెస్ పోతుంది. చమోమైల్ టీనే కాదు చమోమైల్ తో చేసిన పెయిన్ బామ్ కూడా ఉంది. ఇది నొప్పులను ఇట్టే తీసేస్తుంది. అంతేకాదు కడుపునొప్పి, బహిష్టు సమయంలో మహిళలను వేధించే నొప్పి వంటివి కూడా
చమోమైల్ తో పోతాయి. చమోమైల్ లో నొప్పులను తగ్గించే సుగుణాలతో పాటు యాంటిస్పాస్మోడిక్ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

యాంగ్జయిటీ, స్ట్రెస్ వంటి వాటిని కూడా ఈ టీ బాగా తగ్గిస్తుంది. చమోమైల్ లోని సాంత్వన నిచ్చే గుణాల వల్ల నరాలకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. జలుబు, దగ్గులను కూడా చమోమైల్ టీ తగ్గిస్తుందని పోషకాహార నిపుణులు సైతం చెపుతున్నారు. చమోమైల్ టీలో బోలెడు యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వీటితో శరీరంలో తలెత్తిన వాపు, ఎరుపుదనాలు తగ్గుతాయి. అంతేకాదు ఈ టీలో యాంటాక్సిడెంట్ సుగుణాలు కూడా బోలెడు ఉన్నాయి. ఇవి దగ్గును బాగా నివారిస్తాయి. అజీర్తి, డయేరియా వంటి వాటి నుంచి కూడా ఈ టీ ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.


డైజిస్టివ్ రిలాక్సైటెంట్ గా దీనికి ఎంతో పేరు. గాస్ట్రోఇంటస్టైనల్ సమస్యలను కూడా ఈ టీ శక్తివంతంగా నివారిస్తుంది. మీరు తిన్న ఆహారం వేగంగా అరిగేలా చేస్తుంది. అలా శరీర క్రియలన్నీ బాగా జరిగి మీరెంతో ఆరోగ్యంగా ఉంటారు. అందుకే రాత్రి పడుకోబోయే ముందు ఈ టీని తాగడం మరవొద్దు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News