Sunday, February 2, 2025
Homeహెల్త్Cholesterol Control Tips: ఈ గుమ్మడి ఆకులతో కొలెస్ట్రాల్ కి చెక్..!!

Cholesterol Control Tips: ఈ గుమ్మడి ఆకులతో కొలెస్ట్రాల్ కి చెక్..!!

సాధారణంగా మనం గుమ్మడి కాయ(pumpkin)ను ఇంటి ముందు దిష్టికి ఉపయోగిస్తుంటాం. అంతే కాదు ఈ గుమ్మడి కాయతో కూరలు కూడా వండుకుంటాం. గుమ్మడి విత్తనాలు ఎండుబెట్టుకుని తినటం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

- Advertisement -

ఇంత వరకు తెలుసు కానీ గుమ్మడి ఆకు వల్ల కూడా చాలా ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇది కొలెస్ట్రాల్‌కు దివ్య ఔషధంగా పని చేస్తుంది. అందరూ పండిన గుమ్మడితో కూర చేసుకుని తింటారు. హల్వా కూడా చేసుకుని తింటూ ఉంటారు. కానీ గుమ్మడి కాండం, ఎండిన ఆకుల్లో కూడా అనేక పోషక లక్షణాలను కలిగి ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు

కొలస్ట్రాల్ అదుపులో ఉంటుంది
గుమ్మడి గింజల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందన్నారు. ఇందులో ఎక్కువగా పీచు పదార్ధం ఉంటుంది. తద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగిస్తారు.

షుగర్ కంట్రోల్
ఈ కాయ తినడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మధుమేహం వంటి సమస్యలను నివారిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మీకు మధుమేహం వంటి సమస్యలు ఉంటే ఈ కూరగాయలను కళ్ళు మూసుకుని తినవచ్చు.


ఎముకల సమస్యకు చెక్
చాలా కాలంగా వేధిస్తున్న ఎముకల సమస్యలతో బాధపడుతున్న వారికి దీని ఆకు చాలా బాగా పని చేస్తుంది. అందుకని గుప్పెడు ఎండు ఆకుల రసాన్ని ఓ గ్లాసు నీటిలో కలుపుకుని ఉదయం ఖాళీ కడుపుతో, రాత్రిపూట రెగ్యులర్ భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు రసం తాగితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందంటా. ఈ ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తహీనత నుండి శరీరాన్ని రక్షిస్తుంది.

గాయాలు మానటంలో తోడ్పాటు
శరీరంలోని ఏదైనా గాయాన్ని త్వరగా నయం చేయడానికి ఈ గుమ్మడి కాండం ఉపయోగపడుతుంది. ఇందులో గాయాన్ని మాన్పే లక్షణాలున్నాయని వైద్యులు తెలిపారు. కాబట్టి ఆహరంలో ఈ గుమ్మడికాయను చేర్చుకోవచ్చని చెబుతున్నారు.

గర్బిణీలకు మేలు
ప్రెగ్నెన్సీ సమయంలో ఈ కూరగాయ తినడం మహిళలకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయ పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. వెల్లుల్లి మరియు నల్ల జీలకర్రతో ఈ కాయను వండుకుని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి మీరు వైద్యుల సూచనల ప్రకారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ రోజే ఈ గుమ్మడి కాయను వండుకుని తినడం ప్రారంభించండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News